వైరల్: పంది పిల్లలకు పాలు ఇస్తున్న శునకం..!

ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తుంటే ఎవరయినా సరే ఆశ్చర్యపోవాలిసిందే.పక్కవారు ఎలా పోతే నాకేంటి నేను,నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే ఈ రోజుల్లో తన తోటి జంతువుల పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాటికి పాలు ఇచ్చి మరి వాటి ఆకలిని తీర్చింది ఒక కుక్క.

 Viral: Dog Giving Milk To Piglets, Dog, Petits, Milk , Latest News, Viral Latest-TeluguStop.com

నిజంగా ఆ కుక్క చేసిన పనికి దానిని పొగడకుండా ఉండలేరు.ఎందుకంటే జాతి వైరాన్ని కూడా మర్చిపోయి రెండు పంది పిల్లల ఆకలిని తీర్చింది ఈ శునకం.

సహజంగా పందులకు, కుక్కలకు అస్సలు పడదు.పందులు ఎక్కడన్నా కనిపిస్తే చాలు కుక్కలు వెంటబడి మరి తరుముతాయి.

అలాగే కుక్కపిల్లల్ని చూసి పందులు కూడా గాయపరచి చంపేస్తాయి.

కానీ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో మాత్రం ఒక కుక్క రెండు పంది పిల్లలకు పాలిచ్చి వాటికి అమ్మగా మారి వాటి ప్రాణాలను కాపాడింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఆ శునకంపై స్థానికులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జంతువులకు కూడా భావోద్వేగాలు, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని, అవసరాన్ని బట్టి అవి ప్రదర్శిస్తాయి అని తెలుస్తుంది.తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామంలో ఓ కుక్క జాతి వైరాన్ని మరచి పంది పిల్లలకు పాలు ఇచ్చింది.

జక్కమ్మ చెరువు ప్రాంతంలో పందులు, పంది పిల్లలు బాగా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే అక్కడ తిరుగుతున్న ఓ శునకం ఆకలితో ఉన్న రెండు పంది పిల్లలకు పాలిచ్చి వాటి ఆకలిని తీర్చి శునకానందం పొందింది.

పంది పిల్లలు కుక్క పాలు తాగడం చూసిన చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఎందుకంటే ఆ రెండిటికి జాతి వైరం ఉంది కాబట్టి.

దీనిని కూడా వింతగా భావించి చుట్టుపక్కల జనాలు కుక్క పంది పిల్లలకు పాలిచ్చే దృశ్యాన్ని చూడడానికి అక్కడికి తరలివస్తున్నారు.సాటి జంతువు కష్టాల్లో ఉన్నప్పుడు తమ మధ్య ఉన్న వైరాన్ని సైతం పక్కనపెట్టి సాటి జంతువు ఆకలి తీర్చింది మరొక జంతువు.

కానీ మనుషులు మాత్రం పక్కవాళ్ళతో నాకేంటి నేను బాగున్నా కదా అని భావిస్తున్నారు.సాటి మనిషి అనికూడా చూడకుండా హత్యలు చేసి మరి వారిని చంపేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube