వైరల్: చదరంగంలో పావులు నడిసొస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇది చూడండి!

ప్రముఖ వాణిజ్య వేత్త ఆనంద మహీంద్ర పరిచయం అక్కర్లేదు.నిత్యం తమ వ్యాపార వ్యవరాల్లో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో అభిమానులకు చేరువగా ఉండటం అతని ప్రత్యేకత.

 Viral: Do You Know How The Pieces Move In Chess Chess, Anandh Mahindra, Technolo-TeluguStop.com

ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా మరో అద్బుతమైన వీడియోను షేర్‌ చేసి సోషల్‌ మీడియాని షేక్ చేసారు.సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఇన్నోవేటివ్‌ కథనాలను, వీడియోలను నెటిజన్లతో పంచుకునే విషయంలో ఆనంద్‌ మహీంద్ర అందరికంటే ముందుంటాడు.

ప్రస్తుతం షేర్ చేసిన వీడియోలో చెస్ బోర్డులో ఉన్న పావులకు ప్రాణమొచ్చి మనుషులుగా మారితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

ఈ కనబడుతున్న కార్యక్రమం తమిళనాడు రాష్ట్రం, పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో చేసినది.ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.“అద్భుతం! పుదుక్కొట్టాయ్ కలెక్టర్ శ్రీమతి కవితారాము కొరియోగ్రఫీ చేసినట్టు నాకు చెప్పారు.చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు.ఇది ప్రామాణికతను కలిగి ఉంది.మన దేశంలో కనుగొనబడిన అతి గొప్ప గేమ్ ఇది!” అని ఆనంద్ మహీంద్రా కొనియాడారు.ఈ వీడియోను పుదుక్కొట్టాయ్ జిల్లా యంత్రాంగం రూపొందించింది.

ఇక ఈ డ్యాన్స్ వీడియోను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మెచ్చుకోవడం కొసమెరుపు.జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రశంసించారు.

చదరంగం ఓ భారతీయ ప్రాచీన క్రీడ.పూర్వం రాజులు తమ ప్రత్యర్థులతో తలపడేటప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో.వారిని ఎలా ఓడించాలో అనే విషయాలపై ఎక్కువగా దృష్టిసారించేవారు.ఈ విషయంలోనుండే ఈ ఆట పుట్టిందని అంటూవుంటారు.

ఈ ఆటద్వారా ఎత్తులు, పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను ఎలా మట్టుపెట్టాలో తెలుస్తుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube