వైర‌ల్‌.. ఇంట‌ర్వ్యూలో తెలుగులోనే స‌మాధానాలు చెప్పిన దినేశ్ కార్తీక్‌

Viral Dinesh Karthik Said The Answers In Telugu In The Interview

IPL-2021 ఫైనల్ సందర్భంగా ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.అదేంటంటే.

 Viral Dinesh Karthik Said The Answers In Telugu In The Interview-TeluguStop.com

ఓ క్రికెటర్‌ను తెలుగులో ఇంటర్వ్యూ చేయగా .అతను కూడా తెలుగులోనే అనర్గళంగా సమాధానం ఇచ్చాడు.ప్రస్తుతం ఈ తెలుగు ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.ప్రస్తుతం దీని గురించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ చర్చించుకుంటున్నారట.ఆ క్రికెటర్ మరెవరో కాదు.కేకేఆర్ జట్టు ఆటగాడు దినేష్ కార్తీక్.

ఈ క్రికెటర్ తమిళనాడుకు చెందిన వాడు కాగా, అతని మాతృభాష అయిన తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడగలడు.అయితే, మ్యాచ్ సందర్భంగా కొందరు కామెంటెటర్లు ఆటగాళ్లను మధ్య మధ్యలో ఇంటర్య్యూ చేస్తుండటం మన చూసే ఉంటాం.

 Viral Dinesh Karthik Said The Answers In Telugu In The Interview-వైర‌ల్‌.. ఇంట‌ర్వ్యూలో తెలుగులోనే స‌మాధానాలు చెప్పిన దినేశ్ కార్తీక్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న జరిగిన సీఎస్కే వర్సెస్ కేకేఆర్ ఫైనల్ మ్యాచులో దినేష్ కార్తీక్‌కు తెలుగులో మాట్లాడే సామర్థ్యం ఉందని తొలిసారిగా బయటపడింది.ఈ విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం అవుతుందనగా దినేష్ కార్తీక్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.స్టార్ కామెంటెటర్ హైదరాబాద్‌కు చెందిన హర్ష భోగ్లే కార్తీక్‌ను తెలుగులో ఇంటర్వ్యూ చేయడం విశేషం.

సాధారణంగా ఇండియన్ క్రికెటర్లను ఇంగ్లీషులో లేదా హిందీలో ప్రశ్నలు అడుగుతారు.కానీ, వ్యాఖ్యాత హర్ష బోగ్లే తొలిసారి దినేష్ కార్తీక్‌కు తెలుగులో విజయదశమి శుభాకాంక్షలు తెలిపాడు.

ఫైనల్ మ్యాచ్‌ కోసం ఎలా సన్నద్ధం అయ్యారని అడిగాడు.దీనికి కార్తీక్ కూడా తెలుగులోనే చాలా బాగా సమాధానమివ్వడం గమనార్హం.

దీంతో తెలుగు ప్రేక్షకులే కాదు, కామెంటేటర్ హర్ష కూడా అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

దినేశ్ కార్తీక్ ఇలా తెలుగులో మాట్లాడటానికి సంబంధించిన ఇంటర్య్వూ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.

ఇలా దినేశ్ కార్తీక్ తెలుగులో స‌మాధానాలు చెప్ప‌డాన్ని చూస్తుంటే ఇంత చ‌క్క‌గా ఎలా మాట్లాడుతున్నాడంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.హర్ష కూడా ఇలా మాట్లాడిన దాన్ని చూసి మెచ్చుకుంటున్నాడు.

.

#DineshKarthik #Dinesh Karthik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube