వైరల్: కేవలం రూ. 500 ల ఖర్చుతో తమ పెళ్లిని ముగించిన యువ జంట..!

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు పెద్దలు చెబుతుంటారు.ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్ లు, షామియానాలు, కిరాయి కి ముత్తైదువులు, కాంట్రాక్టు వంటకాలు, పెళ్లి ప్యాకేజి పేరుతో అంతా అరువు తెచ్చుకున్న మనుషులను ఇప్పుడు చూస్తున్నాం.

 Viral Couple Done Their Marriage Ceremony In Just 500 Rupees, Army Major, Marria-TeluguStop.com

కానీ గతంలో పెళ్లి అంటే తాటాకులతో పందిరి వేస్తారు.మామిడి ఆకులతో తోరణాలు కడుతారు.

అరిటాకుల్లో భోజనాలు పెడుతారు.పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ కాబట్టి ఎంతో వైభవంగా చేస్తారు.

రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు పెళ్లి.రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టమే పెళ్లి.

ఒక సాధారణ ఉద్యోగి కూడా తన పెళ్లిని ఎంతో ఆర్బాటంగా చేసుకుంటాడు.అలాంటిది ఓ వరుడు అయిన ఆర్మీ మేజర్ ఓ వధువు అయిన ఓ సిటీకి మేజిస్ట్రేట్ తన పెళ్లిని ఎంతో గొప్పగా చేసుకోవాలి.

బంధువులతో ఆ పెళ్లి అనేది కిక్కిరిసిపోవాలి.తమ తోటి ఉద్యోగుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందర్నీ పిలిచి హడావుడి చేయాలి.కానీ ఆ పెళ్లి అలా జరగలేదు.ఈ జంట ఆడంబరంగా ఆ పెళ్లిని చేసుకోలేదు.

ఓ పదిమంది కూడా వారి పెళ్లి జరిగిపోయింది.

Telugu Rs, Magistrate, Rupees, Ceremony, Latest-Latest News - Telugu

భాజా భజంత్రీలు కూడా లేవు.వాళ్లు చాలా సింపుల్ గా తమ పెళ్లిని జరుపుకున్నారు.ఆ పెళ్ళికి రిజిస్టారాఫీస్ వేదిక అయ్యింది.కేవలం రూ.500తోనే వారి పెళ్లి మొత్తం జరిగిపోయింది.మహారాష్ట్రలోని ధార్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.నగర మేజిస్ట్రేట్ శివాంగి జోషి ఆర్మీ మేజర్ అంకిత్ చతుర్వేది పెళ్లి నిరాడంబరంగా చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.కేవలం వారికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య మాత్రమే పెళ్లి జరిగింది.స్వీట్ల కోసం రూ.500లు ఖర్చు చేశారు.వారిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube