Viral: ఇంత ఖరీదైన దున్నలు మీరు చూసుండరు? షాక్ అయిపోవాల్సిందే!

దున్నలేమిటి, అంత ఖరీదేమిటి? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.అవును, మీరు విన్నది అక్షరాలా నిజం.

 Viral: ఇంత ఖరీదైన దున్నలు మీరు చూస-TeluguStop.com

ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత హైదరాబాద్‌లో జరిగే సదర్ ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు.ఆ ఉత్సవాలు చూడాలంటే 2 కళ్లు సరిపోవు.

ఇందులో దున్నరాజుల విన్యాసాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.అందంగా అలంకరించిన దున్నపోతులతో కుస్తీ పట్టడమే సదర్‌ స్పెషాలిటీ అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఉత్సవాలకు వచ్చే దున్నలు ఎంత ధృడంగా, అందంగా ఉంటాయో.వాటి అలంకరణ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Telugu Crore Buffalo, Expensive Oxen, Redyache Malak, Maharashtra Ox, Buffalo-La

ఇకపోతే అలాంటి ఓ దున్న ఇప్పుడు మహారాష్ట్రలో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.అవును, బీడ్‌ జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు కోసం ఓ దున్నను తీసుకురాగా అక్కడి ప్రజలు, రైతులు ఆ దున్నను చూసి ఆశ్చర్యపోతున్నారు.ఈ భారీ దున్నపోతు యజమాని కర్ణాటక బెళగావికి చెందిన ‘రెడ్యాచే మాలక్‌.’ కాగా అతగాడు పెంచుకున్న దున్నపోతుకి గజేంద్ర అని పేరు పెట్టాడు.పేరుకి తగ్గట్టే అది ఏనుగు మాదిరి ఉండటం కొసమెరుపు.

Telugu Crore Buffalo, Expensive Oxen, Redyache Malak, Maharashtra Ox, Buffalo-La

కాగా ఈ ప్రదర్శనకు వచ్చిన పంజాబ్‌ రైతులు ఈ దున్నను చూసి చాలా ఆనందపడిపోయారు.అంతేకాకుండా ఆ విషయం ఆనోటా ఈనోటా విన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దానిని చూసేందుకు ఎగబడ్డారు అంటే మీరు నమ్మితీరాల్సిందే.ఇక దాన్ని కొనేందుకు వేలసంఖ్యలో ఎగబడ్డారు అంటే అతిశయోక్తిగా ఉంటుంది.ఒకరైతే ఏకంగా రూ.1.5 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా దాని యజమాని నో చెప్పడం కొసమెరుపు.దాదాపు 1,500 కిలోల బరువున్న ఈ దున్న రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుందట.అంతేకాకుండా 2 కిలోల పిండి, 3 కిలోల గడ్డి తింటుందట.ఇలాంటి భారీ దున్నలు తమ దగ్గర 5 ఉన్నాయని, ఇంట్లో మనిషిలాగానే వాటిని సాకుతానని, అందుకే ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మనంటే అమ్మను అని తెగేసి చెబుతున్నాడు రైతు రెడ్యాచే మాలక్‌.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube