వైర‌ల్‌.. వ‌ర‌ద‌ల్లో వంట పాత్ర‌నే పెండ్లి వాహ‌నం అయింది..

మొన్న‌టికి మొన్న గులాబ్ తుఫాన్ దేశ వ్యాప్తంగా ఎంత‌లా బీభ‌త్సం సృష్టించిందో చూశాం.దాని దెబ్బ‌కు దేశ‌లోని చాలా రాష్ట్రాల్లో వ‌ర‌ద‌లు విప‌రీతంగా వ‌చ్చేశాయి.

 Viral Cooking Utensils Have Become The Wedding Vehicle In The Wild-TeluguStop.com

అయితే ఈ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.ముఖ్యంగా పెద్ద న‌గ‌రాల్లో విప‌రీతంగా వ‌ర‌ద‌లు రావ‌డంతో చాలామంది నిరాశ్ర‌యుల‌య్యారు.

ఇంకొంద‌రు అయితే తిన‌డానికి తిండి లేక ఇబ్బంది పడ్డారు.ఈ స‌మ‌యంలో పెండ్లిలు చేసుకునే వారు అయితే వాటిని పూర్తిగా వాయిదా వేసుకున్నారు.

 Viral Cooking Utensils Have Become The Wedding Vehicle In The Wild-వైర‌ల్‌.. వ‌ర‌ద‌ల్లో వంట పాత్ర‌నే పెండ్లి వాహ‌నం అయింది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వీటిని మ‌రువ‌క ముందే గ‌త రోజులుగా దైవ‌భూమి అయిన కేరళలో విప‌రీతంగా వర్షాలు ప‌డుతున్నాయి.

దీంతో ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు వ‌ర‌ద‌ల‌తో అల్లాడిపోతున్నాయి.

ప్ర‌ధాన పట్టణాల‌తో పాటుగా చాలా నగరాలు నీట మునిగాయి.ఎక్క‌డిక‌క్క‌డ వాగులు, వంకలు తీవ్ర స్థాయిలో ఉప్పొంగ‌డంతో ర‌హ‌దారులు కూడా మూత ప‌డ్డాయి.

ఇక ప‌ట్ట‌ణాల్లో అయితే ఏ సందులో చూసినా వ‌ర‌ద నీళ్లే క‌నిపిస్తున్నాయి.ఈ త‌రుణంలో భారీ వర్షాల స‌మ‌యంలో కూడా ఇద్ద‌రు ఆరోగ్య కార్యకర్తలు పెండ్లి చేసుకునేంద‌కు సిద్ధం అయిపోయారు.

ఇదుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.కానీ త‌మ ఇండ్ల చుట్టూ వ‌ర‌ద‌లే ఉన్నాయి.

Telugu Aishwarya, Akash, Couples Travel In Utensils, Function Hall, Kerala Floods, Social Media, Viral Video, Viral Wedding, Wedding-Latest News - Telugu

దీంతో పెండ్లి మంట‌పానికి చేరుకోవాలంటే ఆ వ‌ర‌ద‌ల్లోనే వెళ్లాల్సి వ‌చ్చింది.దీంతో త‌మ బందువు ఓ పెద్ద అల్యూమినియం వంట పాత్ర ను తీసుకు వ‌చ్చారు.దాంట్లో వ‌రుడు, వ‌ధువుల‌ను కూర్చోబెట్టి మంట‌పానికి చేర‌వేశారు.త‌మ‌కు ద‌గ్గ‌ర‌లోని ఆలయం ప‌క్క‌నున్న ఓ ఫంక్ష‌న్ హాలులోకి అలాగే వంట పాత్ర‌లోనే వ‌చ్చారు.అయితే ఈ వంట పాత్ర‌ను నీటిలోనే లాక్కుంటూ వ‌చ్చారు బంధువులు.వారిద్ద‌రి పేర్లు ఐశ్వర్య, ఆకాష్ గా తెలుస్తున్నాయి.

కాగా దీన్నంతా అక్క‌డున్న వారు వీడియో తీయ‌గా అది కాస్తా ఇప్పుడు విప‌రీతంగా ట్రెండ్ అయిపోతోంది.

#Travel Utensils #Aishwarya #Kerala Floods #Akash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube