వైరల్‌ : పోలీసు కానిస్టేబుల్‌కు ఫైన్‌ వేయించిన నెటిజన్స్‌, దేశంలోనే మొదటిసారి అయ్యి ఉండవచ్చు  

Viral Constable Fined For Cell Phone Driving And No Helmet-netizens Fire On Police,telugu Viral News Updates,viral In Social Media

సెప్టెంబర్‌ 1 నుండి వాహనదారులకు కొత్త చలాన్‌ విధానంను ప్రకటించిన విషయం తెల్సిందే.అంతకు ముందు ఉన్న ఫైన్స్‌ కంటే కొత్త ఫైన్‌ దాదాపుగా వంద రెట్టు ఎక్కువగా ఉన్నాయి.వేలకు వేలు జరిమానాలు కట్టించుకోబోతున్నారు.హెల్మెట్‌ లేకుంటే 100 రూపాయలు ఉన్న ఫైన్‌ను వెయ్యికి చేశారు, లైసెన్స్‌ లేకుండా నడిపితే 5 వేల రూపాయల వరకు ఫైన్‌ ఇంకా పెద్ద మొత్తంలో ఫైన్స్‌ పెరిగి పోయాయి.ఇటీవల ఒక బండి వ్యక్తికి ఏకంగా పాతిక వేల ఫైన్‌ను పోలీసులు వేసిన విషయం తెల్సిందే.

Viral Constable Fined For Cell Phone Driving And No Helmet-netizens Fire On Police,telugu Viral News Updates,viral In Social Media-Viral Constable Fined For Cell Phone Driving And No Helmet-Netizens Fire On Police Telugu News Updates In Social Media

బండి ఖరీదు 20 వేల లోపే ఉంది.కాని చలానాలు మాత్రం పాతిక వేలు రావడంతో అతడు కిందా మీదా పడ్డాడు.

Viral Constable Fined For Cell Phone Driving And No Helmet-netizens Fire On Police,telugu Viral News Updates,viral In Social Media-Viral Constable Fined For Cell Phone Driving And No Helmet-Netizens Fire On Police Telugu News Updates In Social Media

ఇక ఇటీవలే ఒక ఆటో వ్యక్తికి ఏకంగా 40 వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది.ఒక ఆటో వ్యక్తి ఎంత కష్టపడితే 40 వేల రూపాయలు వస్తాయి చెప్పండి.ఏదో కష్టపడి సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆటో వాళ్లు కొన్ని డాక్యుమెంట్లు లేని ఆటోలను నడుపుతూ ఉంటారు.

అలాంటి వారిపై పోలీసులు జులూం చూపిస్తారు.చట్టం అందరికి వర్తిస్తుంది అంటారు.కాని పోలీసులు మాత్రం చట్టానికి అతీతులు అవుతూ ఉంటారు.ఎక్కువ సార్లు పోలీసులు బైక్‌ పై వెళ్తున్న సమయంలో హెల్మెట్‌ పెట్టుకోరు, బండి మీద పోతూనే ఫోన్‌ మాట్లాడతారు.కాని వారికి మాత్రం ఇవేవి పట్టింపులు ఉండవు.

కేవలం సామాన్యులకు మాత్రమే ఈ ట్రాఫిక్‌ చలానాలు, శిక్షలు.ట్రాఫిక్‌ పోలీసులు తమ డిపార్ట్‌మెంట్‌ అనే ఉద్దేశ్యంతో వారిని చూసి చూడనట్లుగా వదిలేయడం ఎన్నో సార్లు జరిగింది.

కాని ఈసారి మాత్రం అలా జరగలేదు.నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్‌ బండి నడుపుతూ ఫోన్‌ మాట్లాడుతున్నాడు.కనీసం అతడు హెల్మెట్‌ కూడా పెట్టుకోలేదు.నిర్లక్షంగా బండి నడుపుతున్న ఆ పోలీసును వెనుకనుండి ఒక వ్యక్తి వీడియో తీశాడు.

బండి నెంబర్‌ క్లీయర్‌గా వచ్చేలా వీడియో తీయడం జరిగింది.ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి రచ్చ రచ్చ చేశాడు.

రెండు రోజుల్లోనే ఆ వీడియో వైరల్‌ అయ్యింది.ఆ వీడియో ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది.పోలీసులు సమానత్వం చూపిస్తున్నారు అనే విధంగా అందరికి తెలియాలని వెంటనే సదరు కానిస్టేబుల్‌కు చలానా వేయడం జరిగింది.ఆన్‌ లైన్‌లో అతడికి చలానా వెళ్లింది.ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేసినందుకు వెయ్యి మరియు హెల్మెట్‌ లేనందుకు వంద రూపాయలు జరిమానా రాశారు.

ఈ మొత్తంను అతడు చెల్లించాల్సిందిగా ఈ చలానా వెళ్లింది.ఆ విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తమ ముందు అంతా ఒక్కటే అన్నట్లుగా పేర్కొన్నారు.

చలానా అయితే వేశారు కాని అతడు కట్టాల్సిన అవసరం ఏంటీ అనుకుంటాడు.తన బండిని ఎవరు అడ్డుకుంటారు, తన బండిపై చలానా ఉన్నా కూడా ఎవరు ఆపి తన బండిని లాక్కుంటారని అతడు అనుకుంటారు.

ఈ చలాన్‌ కాకుండా అతడి నుండి నేరుగా చలానా వసూళ్లు చేసి ఉంటే మరింత బాగుంటుందని, ఇతర పోలీసులకు కాస్త టెన్షన్‌ ఉంటుందని ఈ సందర్బంగా నెటిజన్స్‌ అంటున్నాడు.నెటిజన్స్‌ చాలా వరకు ఆ పోలీసును విమర్శిస్తున్నారు.అయితే కొందరు మాత్రం వృత్తి ధర్మం ప్రకారం అతడు అర్జంట్‌ కాల్‌ మాట్లాడుతున్నాడేమో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి సోషల్‌ మీడియా పవర్‌తో ఆ కానిస్టేబుల్‌కు ఫైన్‌ పడింది.ఇది ఇండియన్‌ చరిత్రలో మొదటిసారి అయ్యి ఉంటుంది.ముందు ముందు ఇలాంటివి చాలా కామన్‌గా చూస్తామేమో.