వైరల్: హెలికాప్టర్ లో వచ్చి సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం..!

మన భారతదేశంలో రాజకీయ నేతలు ఎన్నికల నామినేషన్ల దాఖలు మొదలు గెలుపు వరకు వివిధ రకాలుగా ప్రజలను ఆకట్టుకుంటారు.గుర్రాలపై రావటం, ఒంటె పై ఎన్నికల ప్రచారానికి వెళ్లడం వంటి వినూత్నమైన ఆలోచనలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా రాజకీయ నేతలు ముందు అడుగులు వేస్తూ ఉంటారు.

 Viral Come In A Helicopter And Take Oath As Sarpanch,  Jalinder Gagare, Viral La-TeluguStop.com

ఇక ఎన్నికల్లో గెలిస్తే వారి హంగులు ఆర్భాటాలు వేరే లెవెల్ లో ఉంటాయి.ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజకీయ నేతలు మందీమార్బలంతో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటారన్న విషయం తెలిసిందే.

అయితే మహారాష్ట్రకు చెందిన యాభయ్యేళ్ళ జలిందర్ గగరె అనే ఒక పారిశ్రామిక వేత్త అహ్మద్ నగర్ తాలూకాలోని తన సొంత గ్రామమైన అంబీదుమాలా కి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.బీజేపీ పార్టీ బలపరిచిన జలిందర్ అంబీదుమాలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు.

ఐతే వ్యాపారరీత్యా ఆయన పూణే లోనే నివసిస్తుంటారు.కానీ సర్పంచ్ గా ఎన్నిక కావడంతో ప్రమాణస్వీకారం చేసే రోజున ఆయన ఏకంగా హెలికాప్టర్ లో అంబీదుమాలా గ్రామానికి వచ్చారు.

దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందుగా గ్రామంలోని పలు దేవాలయాల పై హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం కురిపించారు.

Telugu Jalinder Gagare, Maharashtra, Oath, Panchayat, Surpanch, Latets-Latest Ne

తదనంతరం ప్రమాణస్వీకారం చేయడానికి హెలికాప్టర్ నుంచి దిగిన జలిందర్ గగరె కి గ్రామస్తులు బాణాసంచా కాల్చుతూ ఘనస్వాగతం పలికారు.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.అయితే కేవలం సొంత గ్రామం అభివృద్ధి కొరకే తాను సర్పంచ్ పదవికి పోటీ చేశానని జలిందర్ గగరె స్పష్టం చేశారు.ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని.

అవసరమైతే తన సొంత డబ్బు ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.వృత్తిరీత్యా పూణేలో ఉంటున్నప్పటికీ.జలిందర్ కి గ్రామస్తులతో మంచి అనుబంధం ఉంది.ఏది ఏమైనా తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న జలిందర్ ని అందరూ తెగ పొగిడేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube