వైరల్: పెళ్లిపై మెరుపు దాడి చేసిన కలెక్టర్.. వధూవరులు అరెస్ట్..!

మరోసారి పెళ్లిళ్లపై కరోనా ఎఫెక్ట్‌ పడింది.దాదాపు మూడు నెలల మూఢం తర్వాత మే నెల 1 మంచి రెండు నెలలపాటు ముహూర్తాలు రాబోతున్నాయి.

 Viral Collector Raids On Marriage Arrested Married Couples For Violating Covid R-TeluguStop.com

గతేడాది కూడా ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.ఆ ఏడాదంతా కరోనాతోనే సరిపోయింది.

అయితే ఈ ఏడాది మొదట్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా మంది పెళ్లిళ్లు కుదుర్చుకున్నారు.మే, జూన్‌ నెలల్లో పెళ్లిళ్ల కోసం ఇప్పటికే నిశ్చితార్థాలు కూడా పూర్తి చేసుకున్నారు.

ఎక్కువ మంది పెళ్లిళ్లు పెట్టుకోవడంతో ప్రతి జిల్లాలో కల్యాణ మండపాలకు డిమాండ్‌ ఏర్పడింది.దాదాపుగా మండపాలన్నీ బుక్‌ అయ్యాయి.

ఇతర పెళ్లి పనులకు కూడా జోరుగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో కరోనా మళ్లీ పడగ విప్పింది.రోజు రోజుకూ తీవ్రత పెరుగుతోంది.

ఈ క్రమంలో ముందుగా నిర్ణయించిన పెళ్లిళ్లు జరగడం అనుమానంగానే మారింది.ఇప్పటికే పలు పట్టణాలు, ప్రాంతాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.దీంతో పెళ్లిళ్లకు అనుమతి ఉంటుందా.? అన్నది కూడా ఆయా కుటుంబాల్లో సందిగ్ధంగా మారింది.ఒకవేళ అనుమతి ఇచ్చినా అతికొద్దిమందితో జరుపుకోవాల్సి ఉంటే ఎలా అన్న ఆలోచిస్తున్నారు.దీంతో ఈ దఫాకు పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్న నిర్ణయానికి కొంతమంది వచ్చారు.మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.కల్యాణమండపాల నిర్వాహకులకు కూడా అదే చెబుతున్నారు.

Telugu Carona, Covid, Shaileshkumar, Groom, Tripura-Latest News - Telugu

అయితే కరోనా రాకుండా ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు పెట్టినప్పటికీ చాలా మంది వాటిని పాటించడం లేదు.తాజాగా పెళ్లి చేసుకుంటున్న వారిపై ఓ కలెక్టర్ ఫైర్ అయ్యారు.పశ్చిమ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ యాదవ్ పెళ్లి చేసుకున్నవారిని అరెస్ట్ చేయించారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెళ్లి మండపానికి కలెక్టర్ పోలీసులతో సహా చేరుకున్నారు.

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోవిడ్ వ్యాప్తి కారణమయ్యారనే కారణంతో వధూవరులతో సహా మరికొంత మంది పెళ్లి వారిని అరెస్ట్ చేయించారు.పెళ్లికి అనుమతి ఇచ్చిన రెండు ఫంక్షన్ హళ్లను ఏడాది పాటు ఎలాంటి కార్యక్రమాలు జరపకుండా సీల్ చేశారు.

దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఎంతైనా ప్రభుత్వ అధికారులు మనకోసమే జాగ్రత్తలు చెబుతున్న కానీ చాలామంది నిబంధనలు పాటించకుండా కరుణ వ్యాధికి కారణం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube