వైరల్: ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. చివరికి..!?

ఇంట్లో కూర్చొని చేతివేళ్ళపై ఆర్డర్ చేస్తే ఏ వస్తువైనా కొద్ది రోజుల వ్యవధిలోనే మన ఇంటికి చేరుకుంటుంది.ఈ కాలంలో గ్రామీణ ప్రాంత వాసులు కూడా ఆన్ లైన్ లోనే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

 China Women Got Juice Packet Instead Of I Phone 12 Pro Max Booked In Apple Websi-TeluguStop.com

అయితే ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొక వస్తువు డెలివరీ రావడం మనం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం.గతంలో ఇలాంటి మోసాలు జరిగేవి కానీ కాలక్రమేణా ప్రజలు కేవలం ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచే ఆర్డర్ చేస్తుండడంతో ఇటువంటి మోసాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి.

అయితే కొన్నిసార్లు ప్రముఖ కంపెనీలు కూడా వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుకి బదులుగా వేరేవి పంపిస్తుంటాయి.మళ్లీ తమ తప్పును తెలుసుకొని డెలివరీ అయిన వస్తువును రిటన్ తీసుకొని ఆర్డర్ చేసిన వస్తువును పంపిస్తారు.

కానీ ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే వస్తువు వస్తే కస్టమర్లకు షాక్ తగినట్లు అవుతుంది.లక్షల డబ్బు ముందుగానే చెల్లించి ఖరీదైన వస్తువు ఆర్డర్ పెడితే దానికి బదులు మరొక చవక వస్తువు డెలివరీ చేస్తే ఇంకా కోపం కట్టలు తెంచుకుంటుంది.

అయితే చైనాకు చెందిన ఒక మహిళ కూడా యాపిల్ వెబ్సైట్ లో ఖరీదైన వస్తువు ఆర్డర్ చేసింది కానీ ఆమెకు ఊహించని విధంగా ఒక జ్యూస్ ప్యాకెట్ డెలివరీ చేశారు.ఇంతకీ ఆమె చేసిన ఆర్డర్ ఏంటంటే.

యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్ 12 ప్రో మ్యాక్స్.దీని ధర ఒక లక్ష రూపాయలకు పైగా ఉంటుంది.

అయితే ఐఫోన్ కి బదులు ఆమెకు ఒక యాపిల్ జ్యూస్ డబ్బా డెలివరీ చేశారు.పార్సెల్ ఓపెన్ చేసి చూసిన ఆమె వెంటనే షాక్ అయి ఆ తర్వాత యాపిల్ వెబ్సైట్ కి ఫిర్యాదు చేశారు.

డెలివరీ బాయ్ తనకు నేరుగా పార్సిల్ అందించలేదని అపార్ట్మెంట్ లోని తన లాకర్ లో పార్సిల్ విడిచిపెట్టి వెళ్లాడని ఆమె అంటున్నారు.అయితే ఆమె ఫిర్యాదు మేరకు కంప్లైంట్ నమోదు చేసుకొని డెలివరీ సర్వీస్ లో ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకోవడానికి కంపెనీ దర్యాప్తు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube