వైర‌ల్‌.. మ‌రుగుతున్న నీటిలో స్నానం చేస్తున్న బుడ్డోడు

ఆన్‌డ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే.ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే.

 Viral Child Bathing In Boiling Water, Boiling Water, Child Bathing , Child Bathi-TeluguStop.com

భూమిమీద ఎక్కడ ఏం జరిగిన అది మన కండ్ల ముందుకు వచ్చేస్తుంది.సామాజిక మాధ్య‌మాల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత వ‌రల్డ్ మరింత చిన్నదైపోయింది.

ఫోన్ ఓపెన్ చేస్తే చాలు నిత్యం రకరకాల వీడియోలు క‌న‌బ‌డుతుంటాయి.ఆ వీడియోలు ఏమాత్రం చూడ‌ద‌గిన‌ది అనిపిస్తే చాలు.

క్షణాల్లో వైరల్ అయిపోతోంది.అలాగే ఈ వైరల్ వీడియో కూడా నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే మనం ఎన్నో విచిత్ర వీడియోలు చూస్తూ ఉంటాం.ఇక్కడ ఈ వీడియో కూడా అలాంటిదే.

మ‌నం ఎన్నో వీడియోలు చేస్తుంటాం.మ‌న శ‌రీరంపై వేడి నీళ్లు కొంచం పడితేనే తట్టుకోలేక ఎగురుతాం.

కానీ ఇక్కడ ఈ బుడ్డోడు సలసల కాగుతున్న నీళ్ల‌లో జలకాలాడుతూ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాడు.బాలుడు ఓ కడాయిలో కూర్చొని ఉన్నాడు.

అక్క‌డ ఉన్న వారు కొంత మంది ఆ క‌డాయి కింద మంట పెట్టారు.ఆ గిన్నెలో నీరు మరుగుతున్నా కొద్ది ఆ బాలుడు ఏమాత్రం క‌ద‌ల‌కుండా కూర్చొని ఉన్నాడు.

అది చూసిన వారంద‌రూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు.ఈ వీడియో పాతదే.

కానీ ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్య‌మాల్లో ఊపుతోంది.

ఈ వీడియోకు క్లిప్‌కు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.అయితే ఈ వీడియో న‌కీలిద‌ని కొట్టిపారేస్తున్నారు కొందరు నెటిజన్లు.ఇది ఒక మ్యాజిక్ ట్రిక్.

ప్ర‌జ‌ల‌ను బుడ‌త‌డు మోసం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా ఈ వీడియా ఇప్పుడు నెట్‌లో మరోసారి వైరల్‌గా మారింది.

కానీ వీడియోను చూసి బ‌య‌ట ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని పులువురు కోరుతున్నారు.ఇలాంటివి చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకొని బాధ‌ప‌డొద్ద‌ని సూచిస్తున్నారు.

కానీ వీడియో మాత్రం చాలా మందిని ఆక‌ర్షించ‌డంతో లైక్‌లు కామెంట్‌లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube