వైరల్: బర్త్ డే కేక్ కట్ చేసినందుకు 6 మంది అరెస్ట్.. అసలు మేటర్ ఏంటంటే..?!

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో చాలా చక్కర్లు కొడుతున్నాయి.యువత ఆ వీడియోలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

 Viral Chennai Police Arrested Six Members For Celebrating Birthday-TeluguStop.com

తమ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తూ వీడియోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఎవరైనా తమ బర్త్ డే సందర్బంగా కేక్ ని చిన్న, సున్నితమైన చాకుతో కోసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు.కానీ చెన్నైలో మాత్రం ఆరుగురు యువకులు ఇలా చప్పగా చేస్తే మజా ఏముంటుందని అనుకున్నారో ఏమో గానీ తమ స్నేహితుడి పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కోసేందుకు ఓ పెద్ద కసాయి కత్తినే తెచ్చారు.

 Viral Chennai Police Arrested Six Members For Celebrating Birthday-వైరల్: బర్త్ డే కేక్ కట్ చేసినందుకు 6 మంది అరెస్ట్.. అసలు మేటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా మ్యూజిక్ కూడా పెద్ద సౌండ్ తో పెట్టి గానా బజానాతో హంగామా చేశారు.

జూన్ 6న నగరంలోని కణ్ణగి నగర్ లో జరిగిన పుట్టినరోజు వేడుకలు చివరకు నీరుగారిపోయాయి.

వీరి గోలతో విసుగెత్తిపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.సునీల్ అనే యువకుడితో బాటు నవీన్, కుమార్, అప్పు, దినేష్, రాజేష్, కార్తీక్ అనే యువకులను అరెస్టు చేశారు.

ప్రమాదకరమైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ఏర్పాటు చేసినందుకు వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసు పెట్టారు.

Telugu 6 Members, Arrested, Birthday Day, Cake Cutting, Cake Cutting With Big Knife, Celebrating Birthday, Chennai Police, Latest Viral, Music Sound, Parents, Six Members, Social Media, Viral-Latest News - Telugu

గతంలో కూడా కొందరు యువకులు తమ ఫ్రెండ్ పుట్టినరోజున కేక్ ను పెద్ద కత్తితో కట్ చేసినందుకు బుక్ అయ్యారు.వారిపై పోలీసులు కేసు పెట్టడంతో వారి పేరెంట్స్ ఇందుకు అభ్యంతరం తెలిపారు.మరి ఇప్పుడు ఈ ఘటన ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సిందే పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల సందర్బంలో సినీ పాటలతో మైక్ ల ద్వారా విపరీతమైన సౌండ్ పెట్టి కొందరు ఎంజాయ్ చేస్తున్నారని, కానీ అవి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

#Birthday Day #Viral #6 Members #Music Sound #Parents

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు