వైరల్: తిమింగలాలకు పేర్లు పెట్టే ఛాన్స్‌..!

మామూలుగా అక్వేరియంలో కాస్త అందమైన చేపలు ఉంటాయనీ.అందులో గోల్డ్ ఫిష్ లాంటి అందంగా కనిపించే చేపలు అక్వేరియంలో పెంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Chance Of Naming Whales-TeluguStop.com

ఇక మరికొద్ది పెద్ద అక్వేరియం అయితే మరికాస్త పెద్ద చేపలు కనిపిస్తాయి.ఇకపోతే అదే అతి భారీ సైజులో ఉండే తిమింగలాలను అక్వేరియంలలో పెట్టాలంటే చాలా పెద్ద అక్వేరియం అవసరం కదూ అందుకే కాబోలు డాల్పిన్లు, తిమింగలాల వంటి పెద్దవాటిని పెద్ద పూల్ లాంటివాటిలో ఉంచుతారు.

అయితే తాజాగా యూఎస్ ఒక అక్వేరియం ఓ వింత నిర్ణయాన్ని తీసుకుంది.

 Viral Chance Of Naming Whales-వైరల్: తిమింగలాలకు పేర్లు పెట్టే ఛాన్స్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కెనాడాలో ఉన్న 3 తిమింగిలాలను అమెరికా లోని న్యూయార్క్ తీసుకురావాలని నిర్ణయించుకుంది.

అంతేకాదండోయ్ వాటికి పేర్లు కూడా పెట్టాడానికి ఓ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.సదరు బెలుగా జాతికి చెందిన మొత్తం 3 తిమింగలాలను యూఎస్ అక్వేరియానికి తీసుకురావాలని సీ రీసెర్చ్ ఫౌండేషన్‌ లో భాగమైన మిస్టిక్ అక్వేరియం నిర్వహకులు నిర్ణయించారు.

దీంతో వారు ఈ 3 తిమింగలాలకు పేర్లు పెట్టే ఛాన్స్‌ను వేలం వేయాలని డిసైడ్ చేశారు.అయితే ప్రస్తుతం ఈ 3 తిమింగిలాలు కెనడాలో ఉండగా వాటిని అమెరికాకు తీసుకురావడానికి అయ్యే ఖర్చును వారు సేకరించడం కోసమే నిర్వాహకులు పేర్ల కోసం వేలం నిర్వహించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నిర్ణయం ద్వారా మొత్తంగా 4 మిలియన్ డాలర్లు సేకరించాలని అక్వేరియం నిర్వాహకులు అంచనా వేశారు.వేలం గురించి అక్వేరియం అధ్యక్షుడు సదరు కంపెనీ సీఈవో స్టీఫెన్ కోన్ మాట్లాడుతూ తిమింగిలాలకు పేర్లు పెట్టడానికి మేం కొన్ని పేర్లు సూచిస్తామని, వాటిని వేలానికి వచ్చినవారు సెలక్ట్ చేస్తారని ఆయన తెలిపారు.

ఇక వేలాన్ని ఆగస్టు 19 న నిర్వహిస్తామని ఆయన తెలిపారు.ఆక్వేరియం సంరక్షణ కోసం సంవత్సరానికి 5 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతాయని తెలుపుతూ.ఇదివరకు కూడా తాము కొన్ని జంతువులకు పేర్లు పెట్టామని.ఆ సమయంలో కూడా అనేక మంది వాటినికి పేర్లు పెట్టటానికి ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

#3 Whales #Auctions #America #Name #Chance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు