వైరల్: కలలో వచ్చిన నంబర్స్ తో కాసుల వర్షం.. ఎలా అంటే..?!

అదృష్టం ఉంటే లక్ దానంతట అదే వస్తుంది అంటారు కదా మన పెద్దవాళ్ళు.అలాగే కొంతమంది అయితే రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి కావాలని కలలు కంటూ ఉంటారు.

 Viral Casual Rain With Numbers In A Dream How Is That, Prize Money, Loterry, Dre-TeluguStop.com

కానీ, అది కలని తెలిసి నిరాశ చెందుతారు.ఒకవేళ కలలో జరిగినట్లు నిజంగానే రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడితే అంతకన్నా అదృష్టవంతులు మరోకరు ఉండరు.

అయితే కెనడాకు చెందిన ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండు కూడా జరిగాయి.అతను రాత్రి కల కన్నాడు.

ఆ కలలో కోటీశ్వరుడు అయ్యాడట.అయితే నిజంగానే కోటీశ్వరుడు అయ్యి అందరిని షాక్ లో ముంచేశాడు.దీంతో దెబ్బకు రూ.340 కోట్లు ఇంట్లో వచ్చి పడ్డాయి.అసలు కల కనడమేంటి.? ఆ కలలో కోట్లు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? మీరు నమ్మలేక పోయినప్పటికీ ఇది నిజం.అసలు పూర్తి వివరాల్లోకి వెళితే.

కెనడాకు చెందిన ఓ వ్యక్తి తాను లాటరీ ద్వారా తమ కుటుంబం కోట్లు గెలుచుకున్నట్టు 20ఏళ్ల క్రిందట నిద్రలో కల కన్నాడు.పొద్దునే లేచీ తనకు వచ్చిన కల గురించి తన భార్య డెంగ్ ప్రవతౌదమ్‌ కు చెప్పాడు.

ఆ కలలో తనకి కొన్ని నంబర్స్ వచ్చాయని, ఆ నెంబర్‌ల ద్వారానే తను కోట్లు గెలిచినట్టు వివరించాడు.అయితే డెంగ్ ప్రవతౌదమ్ మాత్రం తన భర్త చెప్పిన మాటలను ఒక చెవితో విని మరో చెవితో విడిచిపెట్టకుండా.

సీరియస్ గా తీసుకుంది.తన భర్తకు కలలో వచ్చిన నెంబర్లు, తమ కుటుంబానికి కాసుల వర్షం కురిపిస్తాయని బలంగా నమ్మింది.

ఈ క్రమంలోనే సుమారు 20ఏళ్లుగా తన భర్త కలలో వచ్చిన నెంబర్ల ఆధారంగా ఒంటారియో లాటరీ అండ్ గేమింగ్ (ఓఎల్‌జీ)లో పాల్గొంటూ వచ్చింది.ఈ క్రమంలోనే డిసెంబర్‌లో డెంగ్ ప్రవతౌదమ్ భర్తకు నిద్రలో వచ్చిన కల నిజమైంది.కలలో వచ్చిన నెంబర్లతోనే డెంగ్ ప్రవతౌదమ్ లాటరీలో 60 మిలియన్ల కెనెడియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.340 కోట్లు గెలుచుకున్నట్టు ఓఎల్‌జీ ప్రకటించింది.ఇంకేముంది దీంతో డెంగ్ ప్రవతౌదమ్, తన భర్త ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.

ఈ నేపథ్యంలో డెంగ్ ప్రవతౌదమ్ స్పందిస్తూ.

అసలు ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను.ఈ విషయాన్ని మొదటగా తన భర్త చెప్పినప్పుడు తాను నమ్మలేదని చెప్పారు.

తరువాత ఆలోంచించగా అయితే అది వాస్తవం అని గ్రహించి, ఒక్కసారిగా ఏడ్చేసినట్టు తెలిపారు.ఇంత డబ్బు మేము గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఎందుకంటే.కరోనా కారణంగా మేము చేస్తున్న పనులు కూడా పోయి ఆర్ధికంగా వెనుకబడి పోయాము.

ఇప్పటివరకు తమ కుటుంబానికి అక్కడ ఉన్న చర్చి సహాయం చేస్తున్నట్టు చెప్పారు. 40ఏళ్లుగా తన భర్త లేబర్‌ గా పని చేస్తున్నాడని తెలిపింది.

మాకు వచ్చిన ఈ డబ్బుతో పిల్లల ఫీజులను కట్టడంతోపాటు, ఓ ఇల్లును కూడా కొనుకుంటాము అని ఆమె తెలిపారు.అంతేకాకుండా కొవిడ్ అనంతరం ప్రపంచ యాత్రకు కూడా వెళ్తామని తెలిపారు.

 ఇలా కలలో జరిగిన విషయం నిజం అయ్యి కోట్లు రావడం అంటే ఇప్పటికి మనం నమ్మలేని నిజం కదా.ఎంతయినా ఈ కుటుంభం ఒక పెద్ద జాక్ పాట్ కొట్టేసిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube