వైరల్: కొత్తతరం క్రికెట్ బ్యాట్స్ ను తయారు చేస్తున్న కేంబ్రిడ్జి పరిశోధకులు..!

కేంబ్రిడ్జ్ వర్శిటీ పరిశోధకులు ఓ కొత్త రకం బ్యాట్ ను తయారు చేయటానికి కృషి చేస్తున్నారు.ఆ బ్యాట్ తో కొడితే బంతి బ్యాట్ కు ఎక్కడ తగిలినా బౌండరీ వైపు దూసుకెళుతుంది.

 Viral Cambridge Researchers Make New Generation Of Cricket Bats-TeluguStop.com

ఇలాంటి బ్యాట్ ను తయారు చేయడానికి చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.చాలా కాలంగా విల్లో వుడ్‌తోనే బ్యాట్లు తయారు చేస్తున్నారు.

అయితే విల్లో ఉడ్ కు బదులుగా వెదురును వాడొచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.విల్లోతో బ్యాట్ తయారీలో కలప వృథా అవడం ఎక్కువనీ, అదే వెదురుతో తయారుచేస్తే వెదురు చాలా తక్కువ వృథా ఉంటుందంటున్నారు.

 Viral Cambridge Researchers Make New Generation Of Cricket Bats-వైరల్: కొత్తతరం క్రికెట్ బ్యాట్స్ ను తయారు చేస్తున్న కేంబ్రిడ్జి పరిశోధకులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో థాయ్ లాండ్ అండర్-17 నేషనల్ క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్ దర్శిల్ షా బరువు సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ, వాటిని ఫిక్స్‌ చేసుకుంటే ప్రస్తుతం వాడుతున్న విల్లో వుడ్‌ బ్యాట్‌ కంటే బాగుంటుందని తెలిపారు.

ఈ కొత్తరకం బ్యాట్ తయారు ఆలోచనకు విల్లో వుడ్‌ లభ్యత కష్టమవ్వటం కూడా ఓ కారణం.

విల్లో వుడ్‌ తో బ్యాట్ తయారు చేయాలంటే ఆ చెట్టుకు 15 ఏళ్ల వయసు ఉండాలి.దాంతోపాటు ఓ బ్యాటు తయారు చేసినప్పుడు 15 నుంచి 30 శాతం ఉడ్ వేస్ట్ అవుతుంది.

అదే బాంబూవుడ్‌ (వెదురు కర్ర) వల్ల ఇటువంటి వేస్టేస్ సమస్యలు చాలా తక్కువగా ఉంటుందని దర్శిల్ తెలిపారు.విల్లో వుడ్‌ బ్యాట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా బాంబూ బ్యాటు పర్‌ఫార్మెన్స్‌ ఉంటుందనీ, ఇంకా చెప్పాలంటే అంతకుమించి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

ఈ వెదురు బ్యాట్ కు ‘స్వీట్ స్పాట్’ పరిధి చాలా ఎక్కువని, బ్యాట్ లో ఎక్కడ బంతి తగిలినా దూసుకెళుతుందని తెలిపారు.అయితే, ఈ కొత్తరకం బ్యాటు బరువే సమస్యగా మారిందని, బరువు తగ్గించడానికి చర్యలు చేపడుతున్నామని, త్వరలో తేలిక బ్యాటును రూపొందిస్తామని చెబుతున్నారు.

#Sports #Cricktet Bat #Bowndary #Updates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు