వైరల్: వాగ్వివాదాలకు అడ్రస్ గా నిలుస్తున్న తిరుమల కొండపై బస్ ప్రయాణం గేమ్..!

కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడడం మనం గమనించే ఉంటాము.వీరి వీక్ నెస్ ని గమించిన కొంతమంది డబ్బులు సంపాదించే పనిలో పడి రకరకాల గేమ్ యాప్స్ క్రియేట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

 Viral Bus Travel Game On Tirumala Hill Which Stands As An Address To Conflicts-TeluguStop.com

సాక్షాత్తు కలియుగ దైవం అయిన తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడే ప్రయత్నం చేసారు.శ్రీవారితో ఆటలు ఏంటి అనుకుంటున్నారా.

తిరుమల శ్రీవారి కొండ రహదారులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలా శ్రీవారి కొండను ఒక గేమ్ యాప్ లాగా క్రియేట్ చేసి ప్లే స్టోర్ లో విడుదలచేసింది.

 Viral Bus Travel Game On Tirumala Hill Which Stands As An Address To Conflicts-వైరల్: వాగ్వివాదాలకు అడ్రస్ గా నిలుస్తున్న తిరుమల కొండపై బస్ ప్రయాణం గేమ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తిరుమల కొండపై బస్సు ప్రయాణం పేరిట విడుదలైన ఈ యాప్‌ ప్రస్తుతం చర్చకు దారితీసింది.అలిపిరి గరుడ విగ్రహం నుంచి కొండపైకి.

తిరిగి తిరుపతికి ఘాట్ రోడ్డులో ప్రయాణించేలా గేమ్ డిజైన్ చేశారు.

అలాగే ఈ గేమ్ లో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి కొండపైకి ఘాట్ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరు డ్రైవర్ గా వ్యవహరించి, 20 లడ్డులు కొనాలన్న నిబంధన పలు విమర్శలకు దారితీస్తుంది.అంతేకాకుండా ఒక్క గేమ్ ఆడటానికి 179 రూపాయలతో లడ్డులు కొనేలా ఆన్‌లైన్‌ లో డబ్బులు వసూలు చేస్తోన్నారు యాప్‌ నిర్వహకులు.

గేమ్‌ లో ఆడే సమయంలో శ్రీవారి శ్లోకాలు వినపడడం పైనా అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి.అయితే ఈ గేమ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి, యాప్ ను వెంటనే డిలీట్ చేయాలనీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.అసలు ఇంతకు ఈ గేమ్

టెక్ మేడ్స్ సంస్థకు చెందిన ఎండీ సురేశ్ కుమార్ ఏడాది కాలం పాటు కష్టపడి గేమ్ రూపొందించి దానిని గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తెచ్చారు.ఈ గేమ్ గురించి విజిలెన్స్ అధికారులకు తెలిసి టెక్ మేడ్స్ సంస్థలో సోదాలు నిర్వహించి ఈ యాప్ డిజైనర్, ఎండీ సురేశ్ కుమార్ ను ప్రశ్నించగా సురేష్ కుమార్ మాత్రం తాను ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ గేమ్ డిజైన్ చేసానని చెప్పారు.గేమ్ లో భాగంగా శ్రీవారి లడ్డూల కొనుగోలు చేయడం, బ్యాక్ గ్రౌండ్ లో శ్రీవారి శ్లోకాలు వినిపించడం పట్ల టీటీడీ విజిలెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.దీంతో సురేశ్ కుమార్ వెంటనే ప్లే స్టోర్ నుంచి యాప్ డిలీట్ చేశారు.

ఆ తర్వాత ఆఫీస్ కి తాళాలు వేసి కనిపించకుండా పరారయ్యాడు.

#Thirupathi #Ttd #Thirumala Hill #Delate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు