వైరల్ : ఎలుగుబంటి, సింహం మధ్య పోరు మామూలుగా లేదుగా..?!

అడవికి రాజు సింహం అని అంటుంటారు కానీ మన్యంలో దానికి గట్టి పోటీ ఇచ్చే శక్తివంతమైన జంతువులు ఎన్నో ఉన్నాయి.ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సింహాన్ని సైతం చాలా జంతువులు ఎదిరించగలవు.

 Viral Brutal Fight Between Bear And Lion Viral In Social Media, Viral Latest, Vi-TeluguStop.com

ఖడ్గమృగం, ఏనుగు, ఎలుగుబంట్లు ఇలా అత్యంత సమర్థవంతమైన జంతువులు పులులు, సింహాలను పరిగెత్తించగలవు.అందుకే ఎప్పుడూ అమాయకంగా కనిపించే జింకలు, ఆవులు, బర్రెలను అదును చూసుకొని ఆహారంగా ఆరగించేస్తాయి సింహాలు.

ఇవి తమకు సమఉజ్జీలుగా ఉండే జంతువుల జోలికి వెళ్లడం చాలా అరుదు.కాకపోతే తమ నాయకత్వాన్ని ప్రకటించుకునేందుకు ఎంతటి జంతువు పైన దాడులు చేయడానికి వెనకాడవు.ఐతే తాజాగా ఈ తరహాకు చెందిన ఓ భారీ సింహం అడవి దద్దరిల్లేలా గాండ్రిస్తూ ఒక ఎలుగుబంటిపై దాడి చేసింది.ఈ దాడిలో ఏ జంతువుకి గాయం అయినా, సరే.అవి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.అయినప్పటికీ సింహం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు దాడి మొదలెట్టి వార్ వన్ సైడ్ గా మార్చేసింది.

ఈ రెండు జంతువుల భీకర పోరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.ఈ అరుదైన దృశ్యాలు చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.మరి కొందరు వామ్మో అని భయంతో జడుసుకుంటున్నారు.

Telugu Animals Fights, Bear, Deer, Vira, Animals, Latest-Latest News - Telugu

వైరల్ అయిన వీడియో ప్రకారం.పొదల చాటున నక్కిన ఓ సింహం. దూరం నుంచి వస్తున్న ఓ ఎలుగుబంటిని పసిగట్టింది.తన అడ్డాలోనే అడుగు పెడుతుందా.దీనికి ఎంత ధైర్యం అంటూ దానికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని భావించింది.ఇంతలో ఎలుగుబంటి దగ్గరికి రావడంతో అది ఒక్కసారిగా మెరుపు దాడికి దిగింది.ఈ ఊహించని దాడితో ఎలుగుబంటి పై ప్రాణాలు పైనే వదిలేసింది.

కానీ దానికి అద్భుతమైన శక్తి ఉండడంతో ఎదురుదాడి చేసి భారీ సింహానికి సైతం చెమటలు పట్టించింది.

అయితే సింహం దానిని చంపకుండా కేవలం బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టడానికే దాడి చేసినట్లనిపించింది.

మరోవైపు ఎలుగుబంటి ప్రాణాలను రక్షించుకునేందుకు సింహం పంజా దెబ్బలను తట్టుకుంటూ ఫైట్ బ్యాక్ చేసింది.దాని ఎదురుదాడి చూసి సింహం కూడా కాస్త వెనకడుగు వేసింది.దీంతో ఎలుగుబంటి అక్కడినుంచి ఉడాయించింది.ఈ వీడియోను మీరూ చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube