వైరల్: పెళ్లి పీటలపై నిక్కర్ తో ప్రత్యక్షమైన పెళ్లి కొడుకు.. ఎక్కడంటే..?!

ఎవరైనా.ఎక్కడైనా.ఏ సాంప్రదాయం అయినా.సరే పెళ్లంటే పట్టుబట్టలు లేదో సూటో, బూటో తీసుకొని కాస్త అందరికన్నా బాగా కనపడేలా ముస్తాబు అవుతారు కాబోయే దంపతులు.అయితే తాజాగా జరిగిన ఓ పెళ్లి లోని సంఘటన చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఓ పెళ్ళికొడుకు మాత్రం తన పెళ్లిలో కేవలం ఓ నిక్కర్ లో వచ్చి పెళ్లి చేసుకున్నాడు.

 Viral Bride Groom Comes On Shorts During His Marriage In Indonesia-TeluguStop.com

అయితే ఇదేమైనా వారి ఆచారం అని అనుకుంటే మనం పొరబడినట్లే.కానే కాదు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Viral Bride Groom Comes On Shorts During His Marriage In Indonesia-వైరల్: పెళ్లి పీటలపై నిక్కర్ తో ప్రత్యక్షమైన పెళ్లి కొడుకు.. ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు పెళ్లి కొడుకు ఎందుకు ఇలా నిక్కర్ వేసుకుని పెళ్లి చేసుకున్నాడు అని పెళ్లి కూతురుని ఆరాతీయగా ఆవిడ మీడియాకి షాక్ ఇచ్చేలా సమాధానం తెలిపింది.

ఇండోనేషియా దేశానికి చెందిన సుప్రాప్తో , ఎలిండా డ్వీ క్రిస్టియానీల పెళ్లి ఏప్రిల్ 2 న బంధువుల సమక్షంలో జరిగింది.అయితే ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది.

పెళ్ళికొడుకు సుప్రాప్తో నిక్కర్ వేసుకుని పెళ్లి చేసుకోవడానికి గల కారణం అతడు పెళ్లికి ముందు నాలుగు రోజుల క్రితం ఓ ప్రమాదానికి లోనయ్యాడు.

Telugu Bride, Bridegroom On Underwear, Cheedi, Groom, Indonesia Couple, Marraige, Nicker, Social Media, Underwear, Viral, Viral Latest, Viral News, Viral Wedding Photos-Latest News - Telugu

పెట్రోల్ కొట్టించుకొనేందుకు అతడు తన బైక్ పై వెళ్తున్న సమయంలో సడన్ గా అతడు రోడ్డుమీద సృహ తప్పి పడిపోయాడు.ఆ సమయంలో అతడికి బాగా దెబ్బలు తగలడంతో ఓ సర్జరీ కూడా జరిగింది.అయితే ఇలాంటి కఠినమైన సమయంలో పెళ్లి పీటలు ఎక్క వద్దని పెళ్లి కూతురు ఎలిండా డ్వీ క్రిస్టియానీ చెప్పిన కానీ అతడు వినలేదు.

దాంతో అనుకున్న సమయానికి అతడు తన కాబోయే భార్యను పెళ్ళాడి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయాడు.ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోటోలో కనిపిస్తున్న దంపతులను మీరు కూడా ఆశీర్వదించండి.

#Social Media #Viral #ViralWedding #Marraige #Cheedi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు