వైర‌ల్‌.. ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న ఎలుగుబంట్లు..

ప్లే గ్రౌండ్స్‌లో స్టూడెంట్స్ రకరకాల గేమ్స్ ఆడుతుండటం మనం చూడొచ్చు.పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఈ గ్రౌండ్స్‌కు వచ్చి వాకింగ్‌తో పాటు పలు ఎక్సర్‌సైజులు చేస్తుంటారు.

 Viral Bears Playing In The Playground, Viral Video, Bears, Viral Animals Video,-TeluguStop.com

అయితే, మనుషులు కాకుండా జంతువులు కూడా ప్లే గ్రౌండ్స్‌కు వస్తాయి అంటే మీరు నమ్ముతారా? అదెలా సాధ్యం.అస్సలు సాధ్యం కాదు అని మీరు అనుకుంటే పొరపడినట్లే.

ఎలుగుబంటి తన బుల్లి ఎలుగుబంటితో కలిసి ఆటలాడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది.ఇంతకీ ఆ ఎలుగుబంటులు ఆటలాడుకుంటున్న ప్లేస్ ఎక్కడుందంటే.

ఇలా ఎలుగుబంటి తన పిల్లతో కలిసి ఆటలాడుకుంటున్న వీడియోను స్కూల్ టీచర్ వీడియో తీశాడు.అనంతరం ఆ వీడియోను ఎఫ్‌బీలో పోస్ట్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది.

నార్త్ కరోలినాలోని అషెవిల్లేలోని ఐజాక్ డిక్సన్ ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్ బెట్సీ స్టాక్స్‌లాగర్ ఈ వీడియో రికార్డు చేశాడు.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అలా ఎలా ఎలుగుబంటి ఆటలాడగలదు అని కామెంట్స్ చేస్తున్నారు.ఇది నిజమేనా అని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

స్కూల్ ప్లే గ్రౌండ్‌లోని స్లయిడ్‌లో పెద్ద స్లయిడ్‌లో తల్లి ఎలుగుబంటి ఉండగా, చిన్న ఎలుగుబంటి కింద భూమ్మీద ఉంది.ఆటలాడుకుంటున్న క్రమంలో తల్లి ఎలుగుబంటి తన పిల్లను గుండెకు హత్తుకుంది.

Telugu Ashville, Bears, Issacdickson, Mother Bear, Notrh Carolina, Animals, Bear

ఈ క్రమంలోనే భూమ్మీద పడి బొర్రుతూ ఆనందంగా గంతులేస్తోంది.తల్లి ఎలుగుబంటిని చూసి బుల్లి ఎలుగుబంటి సైతం ఆటలాడుకుంటున్నది.ఈ ఎలుగుబంటి వీడియోకు లక్షల్లో వ్యూస్ లభించాయి.ఇంకా వీడియో వైరల్ అవుతూనే ఉంది.ఇకపోతే వీడియో షేర్ చేసిన స్కూల్ టీచర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.ఎలుగుబంటి తన పిల్లతో ఆడుకుంటున్న వీడియోను చూస్తుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతున్నదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube