వైరల్... పిల్లలతో రోడ్డు దాటడానికి ఎలుగుబంటి అష్ట కష్టాలు

తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదన్నది జగమెరిగిన సత్యం.ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న చందంగా పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా వారికి కష్టాలు రాకుండా తల్లి దండ్రులు చాలా కస్టపడుతుంటారు.

 Viral Bear Difficulties To Cross The Road With The Children , Viral News In Inte-TeluguStop.com

అందుకే తల్లిదండ్రులు భగవత్ స్వరూపులు అంటారు.అయితే మనుషులలో ఉన్నట్టే మూగజీవాలు కూడా తమ పిల్లపై ఎంత ప్రేమ కలిగి ఉంటాయన్నది మనకు చాలా సార్లు చాలా ఘటనల ద్వారా రుజువైంది.

జంతువు స్వభావం ఏదైనా కాని తమ పిల్లలను వివిధ రకాల్లో కాపాడుకునే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.వాటితో నడిచే పిల్లలను అయితే తల్లి తన వెంట తీసుకెళ్తుంది.

అదే నడవడం రాని పిల్లలను తమ నోట కరచుకొని తీసుకెళ్తాయి.ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను మనం ఎన్నో చూశాం.

చదివాం కూడా.అయితే తాజాగా ఓ భల్లూకం తన పిల్లలతో కలసి రోడ్డు దాటాడానికి ప్రయత్నిస్తుండగా ఆ తల్లి తన పిల్లలను రోడ్డు దాటించడానికి ఆ భల్లూకం పడిన కష్టం నెటిజన్లను మంత్ర ముగ్ధులని చేసింది.

ఆ భల్లూకం వాహనాలు వస్తున్నాయని భయం భయంగా ఒక్కో పిల్లని నోట కరచుకొని ఒక చోట వదిలి పెట్టి, మరల ఇంకో పిల్లను తీసుకొని వదిలి పెట్టి వెళ్తున్న దృశ్యాలు మూగ జీవాలకు తన పిల్లలపై ఉన్న ప్రేమ గొప్పదనేది అర్థమయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube