వైరల్: ఏటీఎం కార్డు సైజులో ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్..!

ఇప్పుడు మనం చూసే స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే దాదాపు 5 నుంచి 6 ఇంచస్ వరకు ఉంటుంది కదా.ఆలాగే వినియోగదారులు కూడా పెద్ద స్క్రీన్ కావాలని మరి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు.

 Viral: Atm Card Is The Smallest Smartphone In The World In Size, Viral News , Vi-TeluguStop.com

కానీ.ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా అతి చిన్న స్మార్ట్ ఫోన్ మన అందరికి అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను చైనా దేశానికి  చెందిన మోనీ కంపెనీ మింట్ అనే పేరుతో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్ ప్లే మాత్రం 3 అంగుళాలు మాత్రమే ఉండబోతునట్లు సమాచారం.

అంటే మన నిత్యం వాడే క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ సైజులో ఈ స్మార్ట్‌ ఫోన్ ఉంటుందట.అప్పట్లో 3.3 అంగుళాలతో పామ్ ఫోన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.కానీ, ఇప్పుడు అంత కన్నా చిన్న డిస్ ప్లే తో మోనీ కంపనీ మింట్ అనే అతి చిన్న స్మార్ట్‌ ఫోన్ ను తయారు చేసింది.

ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్ ఇదే అవ్వడం విశేషం అని చెప్పాలి.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర 150 డాలర్లు అంట.అంటే మన ఇండియన్ కరెన్సీ లో సుమార 11,131 రూపాయలన్నమాట.అయితే ఎర్లీ బర్డ్ అనే ఆఫర్ కింద ఈ ఫోన్ ను కేవలం 100 డాలర్లు అంటే 7,500 రూపాయలకు మాత్రమే ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ ఫోన్ మీరు కావాలనుకుంటే ఇండీగో క్రౌడ్ ఫండింగ్ అనే వెబ్‌ సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలిసి ఉంటుంది.అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.

ఈ ఫోన్ మీకు కావాలంటే ఇప్పుడు ఆర్డర్ చేస్తే నవంబర్‌ లో మీకు లభిస్తుంది.మరి మోనీ మింట్ ఫోన్ లో గల ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దామా.

Telugu Atm Size, Mint, Small, Smart Phone, Meida, Latest-Latest News - Telugu

ఇది పూర్తిగా 4జీ టెక్నాలజీ కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్.మీరు ఈ ఫోన్ లో రెండు సిమ్స్ కూడా యూస్ చేయవచ్చు.అలాగే ఈ ఫోన్ డిస్ ప్లే కేవలం 3 అంగుళాల మాత్రమే ఉంటుంది. 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ తో ఈ అతి చిన్న ఫోన్ పనిచేస్తుంది.ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే 3 gb ర్యామ్, 64 gb ఇంటర్నల్ స్టోరేజ్ తో మనకు అందుబాటులో ఉండగా, మైక్రో ఎస్‌డీ కార్డుతో 128 gb వరకు స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.

ఈ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పని చేయబోతుంది.ఈ స్మార్ట్ ఫోన్  బ్యాటరీ విషయానికి వస్తే 1,250 mah పాలీమర్ బ్యాటరీ ఉంటుంది.

అలాగే  ఈ స్మార్ట్ ఫోన్ ను  ఒకసారి ఫూల్ ఛార్జ్ చేస్తే చాలు 72 గంటల వరకు ఛార్జింగ్ ఉండుతుందని కంపెనీ వారు తెలియచేస్తున్నారు.అలాగే ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూసే ఫీచర్ ఏదన్నా ఉంది అంటే అది కెమెరా ఒక్కటే.

అయితే  ఈ ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరలతో అందచేస్తుంది.కస్టమర్ ల కోసం ఈ ఫోన్ బ్లూ,  బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ బరువు కూడా తక్కువగానే ఉంటుంది.మరి మీకు ఈ ఫోన్ కావాలంటే త్వరగా ఆర్డర్ ఇవ్వండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube