వైరల్: కండోమ్ సహాయంతో ఏకంగా ఒలంపిక్ మెడల్ ను గెలిచిన క్రీడాకారిణి..!

ఇది వరకు కాలంలో హెచ్ఐవీ ఎక్కువగా వ్యాప్తి చెందింది.అయితే ప్రస్తుత సమాజంలో ఉన్న అవగాహన కారణంగా ఈ హెచ్ఐవి వైరస్ వ్యక్తి కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు.

 Viral: Athlete Who Won An Olympic Medal With The Help Of A Condom . Tokyo Olympi-TeluguStop.com

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా ఉచితంగా కండోమ్ లను పంపిణీ చేయడం మొదలు పెట్టాయి.దాంతో చాలా వరకూ ఆ వైరస్ వ్యాప్తిని తగ్గించగలిగాయి.

తాజాగా ఓ క్రీడాకారిని కండోమ్ ను ఉపయోగించి పతకాలు సాధించింది.అంటే మీరేదో ఇంకోలా అనుకోవద్దు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఒలింపిక్స్ గేమ్స్ లో క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.పతకాల వేటను కొనసాగిస్తున్నారు.

టోక్యో వేదికగా సాగే ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో చాలా దేశాలకు చెందిన క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు.ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్లాలోమ్ క‌నోయిస్ట్ జెస్సికా ఫాక్స్ క్రీడాకారిని కేవలం కండోమ్‌ తో చేసినటువంటి ఓ ప్రయోగం వల్ల ఆమెకు ఒలింపిక్స్‌ లో ఒక బంగారం, క్యాంస్య పతకాలు వరించాయి.

ఒలింపిక్స్‌ లాంటి క్రీడలలో సాధార‌ణంగా అథ్లెట్ల‌కు కండోమ్‌ లు ఇస్తుంటారు.

వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా సుర‌క్షిత శృంగారం చేయాల‌ని వారికి ఉచితంగా కండోమ్ లు ఇస్తుంటారు.

ఒలింపిక్స్‌ గేమ్స్ విలేజ్‌ లో క్రీడాకారులందరికీ కూడా కండోమ్‌ లను ఉచితంగా పంపిణీ చేశారు.అయితే అందులో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అయిన జెస్సికా మాత్రం కండోమ్‌ తో వేరే ప్రయోగం చేసి వినియోగించుకుంది.

త‌న క‌యాక్ అయిన చిన్న ప‌డ‌వ‌ను రిపేర్ చేసేందుకు కండోమ్‌ను వాడింది.పోటీ మధ్యలో తన కయాక్‌ కు చివరలో ఒక బొక్క పడింది.

వెంటనే ఆమె ఆ సమయంలో ఆ రంధ్రంలోకి ఒక కార్బన్‌ పొడిని పెట్టింది.ఆ తర్వాత దానిపై కండోమ్‌ తో కప్పి ఆ రంధ్రాన్ని పూర్తిగా పూడ్చింది.తర్వాత అదే కయాక్‌ను వినియోగించి పోటీలోకి దిగింది.జెస్సికా వుమెన్స్‌ C1 కానో సాలోమ్‌ లో స్వర్ణం గెలుచుకుంది.అలాగే కానో సాలోమ్‌ K1 ఫైనల్‌ లో కూడా క్యాంస్య పతకం సాధించింది.ఆ విధంగా కండోమ్‌ ను తన కయాక్‌ కు వాడిన జెస్సికా ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

ఇకపోతే కండోమ్ వాడకం సంబంధించిన వీడియో ని ఆ క్రీడాకారిణి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube