వైరల్: ఫ్రీ గిఫ్ట్స్ అని ఆ అమెజాన్ లింక్ ఓపెన్ చేస్తున్నారా..?! జాగ్రత్త సుమీ..!

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఇందులో ఎక్కువ శాతం ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను వినియోగిస్తూ ఉంటారు.

 Viral: Are You Opening That Amazon Link Called Free Gifts   Be Careful Sumi   Vi-TeluguStop.com

దీంతో ఎక్కువగా వాట్సప్ లో వస్తున్న కొన్ని కొన్ని మెసేజ్ లు అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఫ్రెండ్స్ కానీకుటుంబ సభ్యులు కానీ మనకు అన్నోన్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు.

అలాంటి మెసేజ్లు ఫేక్ అని తెలియకుండా చాలా మంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.ఇలా ఉండగా తాజాగా ఒక మెసేజ్ వాట్సప్ గ్రూపులలో ఫార్వర్డ్ అవుతోంది.

ఆ మెసేజ్ ఏమిటి అని అనుకుంటున్నారా ? అమెజాన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా సర్వే  నిర్వహిస్తోందని, ఇందులో పాల్గొన్న అందరికీ ఫోన్ ను ఉచితంగా అందజేస్తున్నట్లు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది.ఇక ఈ మెసేజ్ ను ఎవరైనా తెలియకుండా క్లిక్ చేసినట్లయితే మీ వ్యక్తిగత వివరాలు అన్నీ కూడా మోసగాళ్ల చేతికి చిక్కినట్లే సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడి ఎందుకు సైబర్ కేటుగాళ్లు ఈ మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ మెసేజ్లు క్లిక్ చేసిన  వారి ప్రమాదంలోకి నెట్టు కోవడమే అనే చెప్పాలి.అదే గ్రూప్ లోకి షేర్ చేస్తే మరింతమందికి సైబర్ నేరగాళ్లు డబ్బు తో చేసే ప్రమాదం ఉంది.

ఇక ఈ సర్వేలో పాల్గొన్న మొదటి వంద మందికి లక్కీ విన్నర్ సుమారు 60 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ లు ఉచితంగా అందజేస్తామని ఈ మెసేజ్ లో పొందుపరిచారు.

ఈ సార్వే పూర్తయిన అనంతరం చివరికి కంగ్రాట్స్ అని మెసేజ్ రావడంతో విజేతలు మీరే అని తెలపడంతో అది నిజమే అని భావించిన కొంతమంది ఈ లింకును వారి ఫ్రెండ్స్ కి లేదా కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్ చేస్తున్నారు.

అవతలి వారు ఆ లింకును ఓపెన్ చేయగానే కనిపించే అచ్చం అమెజాన్ వెబ్ సైట్ తరహాలోనే ఉండడం, కానీ ఆ లింకును చూస్తే తప్పకుండా అది ఫేక్ అని ఇట్లే అర్థమవుతోందివాస్తవానికి Amazon.xyz లేదా మరేదైనా ఉంటే మీరు తప్పకుండా అది ఫేక్ అనే గ్రహించాలి.

కాకుండా ఇలాంటి పలు ఆఫర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే అమెజాన్ ఒరిజినల్ వెబ్సైట్లోకి లేదా ప్రముఖ యాప్ లోకి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది.మరోవైపు అమెజాన్ ప్రముఖ వెబ్ సైట్ లో ఎక్కడ కూడా ఈ స్కీం కు సంబంధించి లేదా సర్వే కు సంబంధించి పూర్తి వివరాలను ప్రస్తావించినట్లు కనపడలేదు.

అంతే కాకుండా 30 వార్షికోత్సవం జరుపుకుంటున్న అని కానీ  అమెజాన్ ఏ విధంగా ప్రకటన కూడా చేయలేదు.ఇలాంటి ఫేక్ లింక్స్ ప్రజలు ఓపెన్ చేయకుండా  జాగ్రత్తగా ఉండడం మంచిది.

అలాగే  ఎవరికీ కూడా గిఫ్ట్ లు డబ్బులు కూడా ఫ్రీగా ఇవ్వారనే విషయం  గుర్తుపెట్టుకోండి.వాట్సప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్న లింకును ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube