వైరల్: ఆకలేస్తుందా..? అయితే, వచ్చి ఇక్కడ ఉచితంగా బిర్యానీతో కడుపు నింపుకోండి..!

గతేడాది కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టించింది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.

 Viral Are You Kidding However Come Here And Fill Your Stomach With Biryani For Free-TeluguStop.com

మరికొంత మంది ఈ వైరస్ బారినపడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.ఇక ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.

లాక్ డౌన్, కరోనా కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.ఇక మళ్ళి మళ్లీ సామాజికంగా, ఆర్థికంగా పుంజుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతుంది.

 Viral Are You Kidding However Come Here And Fill Your Stomach With Biryani For Free-వైరల్: ఆకలేస్తుందా.. అయితే, వచ్చి ఇక్కడ ఉచితంగా బిర్యానీతో కడుపు నింపుకోండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో జనాలలో మళ్ళి గుబులు, భయం మొదలైయ్యాయి.

ఇక గత ఏడాది కంటే ఇప్పుడు కరోనా మహా డేంజర్ గా మారింది.

దీంతో జనాలు బిక్కుబిక్కున కాలం గడుపుతున్నారు.ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎంతో మంది కూలీలకు పని లేకుండా చేస్తోంది.

పేదలు ఆకలి దప్పికలతో అల్లాడుతున్న ఈ తరుణంలో తమిళనాడుకు చెందిన ఓ మహిళ పేదల కడుపు నింపేందుకు ముందుకొచ్చింది.ఆకలేస్తుందని చెబితే చాలు అమ్మలా అన్నం పెడుతుంది.

వేడి వేడి బిర్యానీ ఇచ్చి ఆదుకుంటోంది.ఇక అందరు ఆమెను అన్నపూర్ణతో పోలుస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే కొయంబతూర్‌లోని పులియాకులాం ప్రాంతంలో ఉన్న స్టాల్ ముందు ఉన్న ఓ బ్లాక్ బోర్డు అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది.అయితే ఇంతకీ ఆ బోర్డులో ఏం రాసి ఉందో చూద్దామా.

మీకు ఆకలిగా ఉందా? ఇక్కడికి వచ్చి కడుపు నింపుకోండి అని దానిపై రాసి ఉంది.ఈ స్టాల్ ఫొటోలను తమిళనాడుకు చెందిన రేడియో జాకీ, ‘అమ్మోరు తల్లి’ సినిమా హీరో, దర్శకుడు ఆర్.జె.బాలాజీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.ఇక ఈ పోస్టును చుసిన నెటిజన్స్ ఆమె మహిళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.మానవత్వం ఇంకా బతికి ఉందని చెప్పేందుకు ఈ మహిళే నిదర్శనమని కొనియాడుతున్నారు.

#Coimbatore #Social Media #Hungry People #Free Biryani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు