వైరల్: ఓ పిల్లాడి టాలెంట్ చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యాడు.. ఏమన్నారంటే?

పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.ఎక్కడ టాలెంట్ కనబడినా వారిని మన ఆనంద్ ఆకాశానికెత్తేస్తుంటాడు.

 Viral Anand Mahindra Was Impressed By The Talent Of A Child , Viral Latest , News Viral , Social Media , Video Viral , Anand Mahindra , Talent Of A Child-TeluguStop.com

త‌ర‌చూ ఇలా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలను ఫోటోలు, వీడియోల‌ రూపంలో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా నెక్ట్స్ జ‌నరేష‌న్ ఆఫ్ టాలెంట్ అంటూ న‌డిరోడ్డుపై ఓ బాలుడు చేసిన అద్భుత విన్యాసాల‌తో కూడిన వీడియోను నెట్టింట షేర్ చేశారు.

ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు నడిరోడ్డుమీద గాలిలోకి గింగరాలు కొడుతూ, ఎగురుతూ జంప్ చేస్తూ చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 Viral Anand Mahindra Was Impressed By The Talent Of A Child , Viral Latest , News Viral , Social Media , Video Viral , Anand Mahindra , Talent Of A Child-వైరల్: ఓ పిల్లాడి టాలెంట్ చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యాడు.. ఏమన్నారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

“ఈ టాలెంట్‌ను పాస్ట్ ట్రాక్‌లో మ‌నం ప‌దును పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది” అనే క్యాప్ష‌న్‌తో ఆనంద్ మ‌హీంద్ర పోస్ట్ చేసిన వీడియోకు నెటిజ‌న్ల నుంచి విశేష స్పంద‌న వస్తోంది.

త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలి స‌మీపంలోని ఓ గ్రామంలో సదరు కుర్రాడు విన్యాసాలు చేస్తుండ‌గా త‌న స్నేహితుల్లో ఒక‌రు చూసి వీడియోను పోస్ట్ చేశార‌ని ఆనంద్ మ‌హింద్ర పేర్కొన్నారు.కామ‌న్‌వెల్త్ గేమ్స్‌2022లో స్వ‌ర్ణం గెలుచుకున్న త‌ర్వాత త‌ర్వాతి త‌రం నైపుణ్యాలు ముందుకొస్తున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

ఇక ఈ వీడియోకు ఇప్పటివ‌ర‌కూ 7,68,400కిపైగా వ్యూస్ రాగా 47500కు పైగా లైక్స్ రావడం కొసమెరుపు.ఆ సంఖ్య ఇంకా పెరుగుతూ వుంది.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.“ఈ చిన్నారి భ‌విష్య‌త్ ప్ర‌పంచ జిమ్నాస్టిక్ చాంపియ‌న్” అని ఒకరు కెమెంట్ చేయగా, “ఈ బాలుడికి శిక్ష‌ణ ఇప్పించి, భార‌త ఒలింపిక్స్ టీమ్‌లో చేర్చేలా ఎవ‌రో ఒక‌రు చొర‌వ చూపాలి” అని మ‌రికొంద‌రు యూజ‌ర్లు వ్యాఖ్యానించారు.అలాగే “ఈ బుడ‌త‌డు జిమ్నాస్ట్ ట్రిక్స్‌ను ఇప్ప‌టికే నేర్చుకున్నాడు” అని మ‌రో నెటిజ‌న్ ప్ర‌శంసించారు.ఇక ఇండియా రాక్స్‌, ఫ్యూచ‌ర్ సూప‌ర్‌స్టార్ అంటూ మ‌రికొంద‌రు బాలుడిని ఆకాశానికెత్తేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube