సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలావరకు ఫన్నీగా ఉంటాయి.అటువంటివే మనవాళ్ళు ఎక్కువగా చూస్తారు.
అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకతలు కల్గిన వీడియోలు కూడా ప్రత్యేకంగా అవుతూ ఉంటాయి.అలాంటివి చూసినపుడు మనం చాలా దీర్ఘాలోచనల్లోకి వెళిపోతుంటాం.
ఇలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విటర్‌లో తెగ హల్‌చల్ చేస్తుంది.
అవును, సదరు వీడియోని పరిశీలించినట్టైతే ఓ బాలుడు( boy ) ఒక పొడవాటి కర్ర, టైరు, చిన్న వాటర్ పైపు( Water pipe )తో ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేయడం మనం గమనించవచ్చు.
ఇక దాని సహాయంతో కరెంట్ అక్కర్లేకుండానే ఒక నీటిగుంట నుంచి నేరుగా నీటిని బయటకు తీసుకురావడం కూడా చూడవచ్చు.పొడవాటి కర్రకు ఒకవైపు బరువును, మరోవైపు టైరును ( tire )బిగించడం జరిగింది.
కాగా అతగాడి తెలివికి జోహార్లు అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.అవును, ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ బాలుడి ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతారు.
‘మైండ్ సెట్ మెషిన్’ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ కాబడ్డ ఆ వీడియో అహతులను ఎంతగానో అలరిస్తోంది.ఇప్పటివరకు ఈ వీడియోకు 5 లక్షలకు పైగా చూడడం విశేషం.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేయడం గమనించవచ్చు.అతగాడిని కొందరు ‘జీనియస్’ అని పొగుడుతూ ఉంటే మరికొందరు ‘వెరీ గుడ్ స్కిల్స్’ అని, ఇంకొందరు.క్లవర్ అని, వేరొకరు హీరో అఫ్ ద డేకేడ్ అని ఆ బాలుడిని పొగుడుతున్నారు.
ఏదేమైనా బాలుడి ఇంజనీర్ బుర్రకు మాత్రం మాత్రం మీరు కూడా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు అని మీకు కూడా గట్టిగా చెప్తాం.కావాలంటే ఇక్కడ వీడియోని ఒకసారి చూసి తరించండి.