వైరల్: 74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు..!

ఆడవారి జీవితంలో ఓ ప్రధాన ఘటన చెప్పుకునే అంశం ఆవిడ ఓ బిడ్డకు జన్మనివ్వడం.ఆడవారు మామూలుగా బిడ్డకు జన్మనిచ్చిన వయసు మహా అయితే 40 సంవత్సరాల వరకు వారు బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం కలిగి ఉంటారు.

 Viral An Old Woman Who Gave Birth To Twins At The Age Of 74, 74 Years, Baby Birt-TeluguStop.com

ఆ తర్వాత బిడ్డలకు జన్మనివ్వడం చాలా కష్టమే.అయితే ఇది వరకు జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఓ వృద్ధ మహిళ 74 సంవత్సరాల వయసులో గర్భవతి అయింది.

అంతేకాదు పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చిన ఆవిడ బామ్మ అని పిలిపించుకోవాల్సిన వయసులో అమ్మ అని పిలిపించుకునే పరిస్థితి ఏర్పడింది.ఈ వయసులో గర్భం ఏంటి అని వారి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అన్న కానీ వాటిని ఆవిడలెక్క చేయకుండా తన మాతృత్వాన్ని చాటిచెప్పింది.

ఈ సంఘటన గుంటూరు పట్టణంలోని అహల్య ఆసుపత్రి లో చోటుచేసుకుంది.సదరు బామ్మ పేరు మంగాయమ్మ. ఈవిడ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నెట్టెంపాడు కు చెందిన మహిళ.

Telugu Andhra Pradesh, Baby, Guntur, Preaganat, Latest-Latest News - Telugu

ఇంత లేటు వయసులో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కవల పిల్లలకు జన్మనిచ్చింది.అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతులు ఆ కవల పిల్లలని ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్నారు.అయితే దురదృష్టవశాత్తు పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే ఆ వృద్ధుడు చనిపోయాడు.

అప్పటినుంచి ఆ వృద్ధ దంపతుల బంధుమిత్రులు, ఇరుగుపొరుగువారు ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఆ వృద్ధురాలికి ఎంతో సహాయంగా ఉంటున్నారు.ముందు ముందు ఆ పిల్లలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మంగాయమ్మ ఇప్పటికే పూర్తి చేసింది.

ఆవిడ మరణానంతరం వారి పిల్లలను ఆవిడ అక్క పిల్లలు చూసుకుంటారని దాంతో తనకు ఎటువంటి దిగులు లేదని ఆవిడ ఎంతో ధీమాగా చెబుతోంది.ఏదిఏమైనా ఈ లేటు వయసులో కవల పిల్లలకు జన్మనివ్వడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube