వైరల్: పెళ్లి బాజాల శబ్దంతో ఆ ఏనుగుకు చిర్రెత్తడంతో చివరికి..?!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్‌ మండలం, అమలాపూర్ గ్రామంలో జూన్, 11న ఓ పెళ్లి మండపం వద్ద ఒక పెద్ద ఏనుగు ఉరుకులు పరుగులు పెడుతూ తన దారికి అడ్డు వచ్చిన కార్లను, ఇతర వస్తువులను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది.ఆ ఏనుగు ఉగ్ర రూపం చూసి పెళ్లికి వచ్చిన వారితో పాటు వధూవరులు సైతం ఉరుకులు పరుగులు పెట్టారు.

 Viral An Elephant Got Crazy And Destroyed Wedding Set And Cars In Uttar Pradesh-TeluguStop.com

పూర్తి వివరాలు తెలుసుకుంటే.ఆనంద్ త్రిపాఠి అనే ఒక యువకుడు తన పెళ్ళి ఊరేగింపు కోసం ఒక ఏనుగుని పెళ్లి మండపం వద్దకు తెచ్చుకున్నాడు.

ఏనుగుపై ఊరంతా తిరుగుతూ ప్రజలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవాలని భావించాడు.కానీ అక్కడి వాయిద్యాలు, బాణాసంచా శబ్దాలు ఏనుగుకు బాగా చిరాకు తెప్పించాయి.

దీంతో ఆ ఏనుగులో తీవ్ర అసహనం పెరిగిపోయింది.చివరికి ఆ ఏనుగు వధూవరుల కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన పెళ్లి మండపాన్ని సైతం క్షణాల్లో ధ్వంసం చేసింది.

తీవ్రమైన కోపంతో ఘీంకరిస్తూ అక్కడే ఉన్న నాలుగు కార్లను తన తొండం, కాళ్లతో బాగా పాడు చేసింది.ఈ భయంకరమైన దృశ్యాలను చూసిన వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు తలో దిక్కు చూసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు.

ఆ ఏనుగు దాడిని అక్కడి ప్రజలు ఎవరూ కూడా ఆపడానికి గానీ అదుపులోనికి తేవడానికి గానీ ప్రయత్నం చేయలేదు.కానీ ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు హుటాహుటిన ఫోన్ కాల్ చేసి పరిస్థితిని వివరించారు.

దీంతో రంగంలోకి దిగిన అటవీ, పోలీసు అధికారులు దాదాపు రెండు గంటల సేపు కృషి చేసి చివరికి ఏనుగుని శాంత పరిచారు.

అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడంటూ వరుడు లబోదిబోమంటున్నాడు.ఊరేగింపు కోసమని తెచ్చిన ఏనుగు పెళ్లి మండపం తో పాటు కార్లు సైతం పాడు చేసి ఎంతో నష్టం చేకూర్చింది.సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన సమయం లో ఇలా జరగడం.

పెళ్ళికొడుకుని బాధిస్తుందని చెప్పుకోవచ్చు.ఇకపోతే ఈ ఏనుగు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube