వైరల్: కట్నంగా వింత కోరికలు కోరిన ఆర్మీ ఉద్యోగి.. ఏం డిమాండ్ చేశాడంటే..?!

కట్నం తీసుకోవడం నేరం అని మన చట్టాలు చెబుతున్నాగాని దాదాపు ప్రతిచోటా వరకట్న సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.ఆడపిల్లని కన్న తల్లి తండ్రులు కాబోయే అల్లుడుకి కట్నం ఇవ్వడం అనేది మన సమాజంలో ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.

 Viral An Army Employee Who Wanted Strange Desires As A Dowry What Did He Demand-TeluguStop.com

అలా అబ్బాయి తరుపు వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వకపోతే పెళ్లి అయ్యాక ఆ యువతిని నానా ఇబ్బందులు పెట్టడం, ఆ యువతీ తల్లి తండ్రులను కూడా మాటలతో దూషించడం లాంటి ఘటనలు మనం ఎన్నో చూసి ఉంటాము.ఇదిలా ఉంటే కొంతమంది ఆస్తిపరులు తమ కూతురుకు కట్నం ఇవ్వడం అనేది గొప్ప విషయంగా చెప్పుకుంటూ ఉంటారు.

మా అమ్మాయికి అంత కట్నం ఇచ్చాము.ఇంత కట్నం ఇచ్చాము.

 Viral An Army Employee Who Wanted Strange Desires As A Dowry What Did He Demand-వైరల్: కట్నంగా వింత కోరికలు కోరిన ఆర్మీ ఉద్యోగి.. ఏం డిమాండ్ చేశాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అని తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.ఇది ఇలా ఉంటే ఆడపిల్లకు ఏ తల్లి తండ్రులు అయిన కట్నం కింద స్థలం ఇవ్వడమో లేక బంగారం, వెండి ఆభరణాలు ఇవ్వడమో.

డబ్బులు, బైక్స్, కార్లు లాంటివి కట్నం కింద ఇవ్వడమో మనం చూసే ఉంటాము.ఇకపోతే తాజాగా ఆర్మీలో పనిచేసే ఒక వ్యక్తి తనకు కట్నం కింద ఏమి అడిగాడో తెలిస్తే షాక్ అవుతారు.

అతను అడిగిన లాంఛనాలు ఇవ్వలేక నిచ్చితార్ధం అయిన తరువాత పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది.మరి అతను అడిగిన కట్నం అలాంటిది మరి.ఇంతకు ఆ వ్యక్తి అసలు కట్నం కింద ఏమి అడిగాడో అనే వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.ఈ విచిత్రమైన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్ర లోని నాశిక్‌ అతని స్వస్థలం.అయితే విధుల్లో భాగంగా అస్సాంలో పని చేస్తున్న ఆర్మీ ఉద్యోగికి, ఔరంగబాద్‌ కు చెందిన ఒక యువతితో ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ జరిగింది.

ఇప్పుడు చేసే ఆర్మీ ఉద్యోగం కొన్ని రోజుల్లో పర్మినెంట్ అవుతుందని చెప్పాడు.అతని మాటలు నమ్మిన అయితే ఆ యువతీ అమ్మా నాన్నలు పెళ్ళికి ముందే కట్నం కింద 2 లక్షల రూపాయలు విలువచేసే బంగారంతో పాటు రూ.10 లక్షలు డబ్బులు కూడా అల్లుడు కానీ అల్లుడుకి ముట్ట చెప్పారు.కానీ అతను చెప్పినట్లు ఉద్యోగం పర్మినెంట్‌ అవ్వలేదు.

దీనికి తోడు ఇచ్చిన కట్నం చాలదు అన్నట్టు కొన్ని వింత కోరికలు కోరాడు.

Telugu Army Ma, Dowry, Social Media, Trorise, Viral Latest, Viral News-Latest News - Telugu

అతను అదనపు కట్నం కింద ఏ నగో నట్రానో అడగలేందయ్.అతను అడిగిందల్లా ఒక తాబేళు, దానితో పాటు 21 గోర్లను, అలాగే ఒక నల్ల కుక్కను తనకు కట్నం కింద కావాలని డిమాండ్ చేసాడు.అయితే అతను అడిగిన ఆ తాబేళు విలువ అక్షరాలా 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందట.

దీనితో అతను అడిగిన కట్నం తాము ఇచ్చుకోలేమని అమ్మాయి తరుపు వాళ్ళు పెళ్లి వద్దనుకున్నారు.పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో ఎంగేజ్మెంట్ తరువాత తాము ఇచ్చిన బంగారం, డబ్బులు ఇవ్వమని అబ్బాయి తరుపు వాళ్ళని అడగగా వాళ్ళు ఇవ్వము అని ఖరాకండిగా చెప్పేసారట.

చేసేది లేక అమ్మాయి తరుపు వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు.అలా ఈ వింత సంఘటన బయటకి తెలిసింది అన్నమాట.పెళ్లి కొడుకు అడిగిన తాబేళు ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని తాబేలును ఇవ్వమని కోరాడని తెలుస్తుంది.

#Trorise #Social Media #Dowry #Army Ma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు