వైరల్: తన భర్త మరణించిన 14 నెలల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఎలాగంటే..?!

బిడ్డకు జన్మనివ్వడం అంటే అది ఎంతో సంతోషకరమైన విషయం.ఆ తల్లికి ఆనందం అంతా ఇంత ఉండదు.

 Viral American 40 Years Woman Gave Birth To A Child After 14 Months Of Husband D-TeluguStop.com

అమ్మ అని పిలిపించుకోవడానికి ఆ తల్లి పరితపిస్తుంటుంది.ఇక్కడ కూడా ఓ 40 ఏళ్ల ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.

అది కూడా తన భర్త చనిపోయిన 14 నెలల తర్వాత ఓ పసిబాబుకు జన్మనిచ్చింది.దీనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయమే అని చెప్పొచ్చు.పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది.

అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆమె మే 3న పండంటి మగబిడ్డను కనింది.తన పిల్లలకు తండ్రిలేని లోటు రాకుండా చూసుకుంటానని ఆమె చెప్పడం ఎంతో మందికి ఆనందాన్ని కలిగిస్తోంది.

సారా జీవితంలో ఓ చిన్నారి రాకతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బిడ్డను గుండెలకు హత్తుకొని ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఆమె భర్త స్కాట్ గత సంవత్సరం ఫిబ్రవరిలో గుండె నొప్పితో చనిపోయాడు.ఆయన చనిపోయిన 6 నెలల తర్వాత బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్‌ సాయంతో సారా దానిని కంప్లీట్ చేసింది.

వారిద్దరు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకున్నారని, అయితే ఆ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త ముందు నుంచీ చెబుతూ వస్తున్నాడని తెలిపింది.బిడ్డ పుట్టినప్పటి నుంచి తాను అనాధ కాననే తెలుస్తోందన్నారు.

Telugu Baby Born, Scott, Ivf Process, Mothersarah, Latest-Latest News - Telugu

జీవితానికి ఒక అర్థం దొరికినట్లు ఉందని, పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా అని ధైర్యంగా తెలుపుతోంది.ఈమె మరో పిండం కూడా భద్రపరచి ఉండటం వల్ల ఈ ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కూడా కంటానని ఆమె తెలిపింది.సారా షెలెన్‌బెర్గర్ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండాలని వైద్యులు కూడా ఆమెకు సహకరిస్తున్నారు.సారా తన భర్త, బిడ్డతో దిగిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube