వైరల్: హైవే పై ల్యాండ్ అయిన విమానం.. అసలు మేటర్ ఏంటంటే..?

విమానం రోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

 Viral Aeroplane Lands On Highway In Chicago America , Viral, Viral Latest, Socia-TeluguStop.com

ప్రాణహాని కలుగలేదు.అమెరికాలోని చికాగోలో హైవేపై ఒక చిన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.

విమానం ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు పైలట్ జేసన్ ఎం.బఫ్టన్ తెలిపారు.పైలట్ తోపాటు మరో ముగ్గురు ఈ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు.వెటరన్స్ మెమోరియల్ టోల్‌వే యొక్క సౌత్‌బౌండ్ సందుల్లో ఒక చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ముగ్గురు గాయపడ్డారు.

ఫ్లైట్అవేర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 1975 వైట్ బీచ్ బి 24 ఆర్ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం, లూయిస్ విశ్వవిద్యాలయ విమానాశ్రయం నుండి బయలుదేరిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇంజిన్ లో ట్రబుల్ ఏర్పడింది.దీంతో అత్యవసరంగా హైవేపై ల్యాండింగ్ చేశాడు.

ఇండియానా పోలిస్‌లో భోజనం చేయడానికి వీరు వెళ్తుండగా ఘటన జరిగినట్లు చెప్పారు.బుల్లి ఎయిర్ క్రాఫ్ట్ విమానం పైలట్ జాసన్ ఎం.బఫ్టన్ తోపాటు, విమానంలో ఉన్న క్రిస్టిన్ మెక్ కిమ్, పైజీ ఎం.బఫ్టన్, మరో 15 ఏళ్ల బాలిక వీరంతా వెల్మింగ్టన్ కు చెందిన వారుగా గుర్తించారు.విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా తీవ్ర కుదుపులకు గురికావడంతో గాయపడ్డారు.ఎవరికీ ప్రాణహాని లేదు.కానీ తీవ్రమైన మెడ, ఒళ్లు నొప్పుల సమస్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు.గురువారం ఉద‌యం 11.10 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.చికిత్స కోసం హూటాహూటిన స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు.ఇక ఎల్ల‌ప్పుడూ ర‌ద్దీగా ఉండే హైవేపై విమానం ల్యాండ్ కావ‌డంతో దాదాపు నాలుగు గంట‌ల పాటు ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డినట్లు ఇల్లినాయిస్​ పోలీసులు తెలిపారు.

విమానాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube