పండ్లు అమ్మిన సీనియర్ హీరో నరేష్.. కారణమేమిటంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నరేష్ కరోనా సెకండ్ వేవ్ సమయాన్ని వ్యవసాయం చేస్తూ సద్వినియోగం చేసుకున్నారు.తన ఫామ్ హౌస్ లో లాక్ డౌన్ సమయంలో నరేష్ పండ్లను పండించారు.

 Viral Actor Naresh Sell Mangoes And Kala Jamuns His Studio-TeluguStop.com

తోటలో మామిడి పండ్లతో పాటు నేరేడు పండ్లు పండించిన నరేష్ ఆ పండ్లను తెంపి తన కార్యాలయానికి తెచ్చి ఆ పండ్లను అమ్మారు.ఒకవైపు నటుడిగా మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా బిజీగా ఉన్న నరేష్ వ్యాపారి అవతారమెత్తడం గమనార్హం.

పండ్లను అమ్మడం ద్వారా నరేష్ 3,600 రూపాయలు సంపాదించారు.వ్యవసాయ క్షేత్రంలో పండ్ల తోటలను సాగు చేస్తున్న నరేష్ తన దగ్గర పని చేస్తున్న వాళ్లకు కిలో 50 రూపాయల చొప్పున తక్కువ ధరకే ఆ పండ్లను అమ్మడం గమనార్హం.

 Viral Actor Naresh Sell Mangoes And Kala Jamuns His Studio-పండ్లు అమ్మిన సీనియర్ హీరో నరేష్.. కారణమేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నరేష్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను తెలియజేయడంతో పాటు పండ్లు అమ్మడానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

నటుడిగా తనకు సినిమాల ద్వారా వచ్చిన సంతోషం కంటే ఇలా చేయడం ద్వారా ఎక్కువ సంతోషం పొందానని నరేష్ అన్నారు.

శ్రమతో వ్యవసాయం చేయడంలో మజా ఉందని నరేష్ చెప్పుకొచ్చారు.నరేష్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు.ఈ ఏడాది రిలీజైన శ్రీకారం, రంగ్ దే సినిమాలలోని నరేష్ పాత్రలకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.రంగ్ దే, శ్రీకారం ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా నరేష్ పాత్రలకు మంచి పేరు వచ్చింది.

బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సీనియర్ నరేష్ ప్రేమ సంకెళ్లు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన సినిమాలలో నరేష్ ఎక్కువగా నటించారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీనియర్ నరేష్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

#Prema Sankellu #Srikaram #Mangoes #Senior Naresh #3600 Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు