ఆర్‌ఆర్‌ఆర్‌ బడ్జెట్‌ గురించి సోషల్‌ మీడియాలో పుకార్లు... దానయ్యకు ఆ అవసరం ఏంటీ?

రాజమౌళి సినిమా ఏదైనా కూడా భారీగానే ఉంటుంది.ఆయన ఏ సినిమాను చేసినా కూడా భారీగానే చేస్తాడు.

 Viral About Rrr Movie Budget In Social Media-TeluguStop.com

అందుకే ప్రస్తుతం చేస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ కూడా భారీ బడ్జెట్‌తోనే ఉంటుందని అంతా భావిస్తున్నారు.తాజాగా ప్రెస్‌మీట్‌లో దానయ్యను ఈ విషయమై ఒక విలేకరి ప్రశ్నించాడు.దానయ్య గారు మీరు ఈ మల్టీస్టారర్‌ చిత్రాన్ని ఎంత బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు? ఈ ప్రశ్నకు దానయ్య చెప్పిన సమాధానం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.350 నుండి 400 కోట్ల బడ్జెట్‌ను ఈ చిత్రంకు కేటాయించబోతున్నట్లుగా దానయ్య చెప్పాడు.అయితే ఆయన మాటలు నిజం కాదని చాలా మంది అంటున్నారు.

బాహుబలి వంటి భారీ సెట్టింగ్స్‌, భారీ స్టార్‌కాస్టింగ్‌ ఉన్న సినిమాకే అంత భారీ బడ్జెట్‌ అవ్వలేదు.అలాంటిది ఇద్దరు హీరోలు, మామూలు కథతో చేసే సినిమాకు అంత బడ్జెట్‌ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.అసలు అంత బడ్జెట్‌తో ఏం చేయబోతున్నారు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.

దానయ్య ఈ బడ్జెట్‌ లెక్కలను పబ్లిసిటీ కోసం చెప్పినట్లుగా కొందరు గుసగుసలాడుకుంటున్నారు.భారీగా లెక్కలు చెబితే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయనేది ఆయన ఉద్దేశ్యం అయ్యి ఉంటుంది.

వంద కోట్ల రూపాయలు పారితోషికాలు తీసేసినా మరో 150 కోట్లతో సినిమాను పూర్తి చేయవచ్చు.అంటే మొత్తంగా 250 కోట్లకు లోపులోనే సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చాలా మంది విశ్లేషిస్తున్నారు.

ఖచ్చితంగా దానయ్య పబ్లిసిటీ కోసం ఇలా 400 కోట్ల బడ్జెట్‌ అంటూ ప్రకటించి ఉంటాడు అంటూ చెబుతున్నారు, రాజమౌళి బడ్జెట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వాలని జనాలు కోరుతున్నారు.భారీ ఎత్తున బడ్జెట్‌ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానయ్య హైప్‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.దానయ్య వద్ద 400 కోట్లు ఎక్కడి నుండి ఉన్నాయో ఐటీ వారు చెక్‌ చేయాలని, ఈ సినిమా బడ్జెట్‌ను ఆయన ఎంత ఖర్చు చేస్తున్నాడో ఐటీ వారు పక్కగా చూసుకోవాలని కొందరు సోషల్‌ మీడియాలో ఆదాయపు పన్ను వారికి ఫిర్యాదులు చేస్తున్నారు.మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి ప్రతి చిన్న విషయంలో కూడా రచ్చ రచ్చ చర్చ జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube