వైరల్: పాముతో ఆటలాడుతున్న యువతి..!

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు… ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

 Viral  A Young Woman Playing With A Snake  ,viral Latest , Viral News , Social-TeluguStop.com

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.

లైక్ చేస్తారు.కామెంట్ చేస్తారు.

అయితే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి కొంతమంది ప్రమాదకర వీడియోలని చేస్తారు.ఈ వీడియోల వల్ల నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతారు.

తాజాగా ఓ యువతి పాముతో ఓ వీడియో చేసింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ యువతి తన చేతిలో పాముని పట్టుకొని.ఆ పాముతో ఆడటానికి ప్రయత్నిస్తుంటుంది.అయితే పాము మాత్రం ఆ యువతి చేతి నుండి తప్పించుకోవాలని చూస్తుంటుంది.అయినా యువతి ఆ పాముని వదలదు.

దీంతో పాముతన నోటితో ఆమె మణికట్టుపై కాటువేస్తుంది.అయినా ఆ యువతి దానిని విడిచిపెట్టదు.

తర్వాత పాము యువతి చేతిని కొరుకుతుంది.అయినా ఆ యువతి పాముని అలాగే పట్టుకొని ఆడుతుంటుంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.నెటిజన్లు ఈ వీడియోని చూసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.పాము విషపూరితమైన జీవి.దానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండటమే మంచిది.

లేదంటే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది అంటూ ఒకరు కామెంట్ చేయగా… పాము కాటు వేసినా ఆ యువతికి ఏం కాలేదు అంటూ మరికొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube