వైరల్: పోలీసుల ఎదుటే స్టేషన్‌లో బ్యాక్‌ఫ్లిప్ స్టంట్స్‌ వేసిన యువకుడు.. వద్దన్నా వినుకోలేదు!

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ ముఖ్యంగా యువతీ యువకులు తమ బ్రెయిన్ కి పని పెడుతున్నారు.ఎవరిలో వున్న టాలెంట్ వారు చూపిస్తూ పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 Viral: A Young Man Who Performed Backflip Stunts In Front Of The Police , Railw-TeluguStop.com

కాలం మారిపోయింది.కవితకి కాదేది అనర్హం అన్నట్టు, ఎవరికి వచ్చిన టాలెంట్ వారి వారి మొబైల్ ఫోన్స్ లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

తద్వారా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.ప్ర‌తిరోజూ వైర‌ల్ అవుతున్న‌ అనేక వీడియోలే దీనికి నిద‌ర్శ‌నం.

తాజాగా, రైల్వే స్టేష‌న్‌లో ఓ బాలుడు బ్యాక్‌ఫ్లిప్ స్టంట్స్ వేసి ఔరా అనిపించాడు.అయితే ఇది వేసే సమయంలో అక్కడ పోలీసు ఉండటం గామానార్హం.

మనకి ఇష్టమైన పని ఏదన్నా చేసినపుడు కన్నుమిన్ను కనపడదు.సరిగ్గా అతగాడికి కూడా అలాంటిదే జరిగింది.తనకు వచ్చిన టాలెంటుని చిత్రీకరించామని స్నేహితుడికి మొబైల్ ఇచ్చాడు.తన స్నేహితుడు ఓ సినిమాటోగ్రాఫర్ మాదిరి ఈ వీడియో చిత్రీకరిస్తున్నారు.

సిద్ధంగా వున్న మన స్టెంట్ మాస్టర్ ఇక రైల్వే స్టేషన్ అని చూడకకుండా రెచ్చిపోయాడు.అంతవరకూ పర్వాలేదు.

కానీ ఆ పక్కనే వున్న పోలీసుని మాత్రం అతగాడు గమనించాడో లేదో కూడా అర్ధం కావట్లేదు.ప్ర‌స్తుతం సదరు వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

విషయం ఏదన్నా ఈ వీడియో చూసిన‌ నెటిజన్లు మాత్రం వారిని ‘సూప‌ర్ బ్రో’ అంటూ ఎంక‌రేజ్ చేస్తున్నారు.ఈ వీడియోను ఇన్‌స్టాలో ‘సూర‌జ్‌ సింగ్’ అనే కంటెంట్ క్రియేట‌ర్ షేర్ చేశారు.ఈ వీడియోలో బాలుడు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై బ్యాక్‌ఫ్లిప్‌లను ప్రదర్శిస్తూ అద్భుతమైన స్టంట్ చేస్తున్నాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో రైలు ఆగి ఉంది.అందులోని ప్ర‌యాణికులు ఈ స్టంట్స్‌ను ఉత్కంఠ‌గా చూస్తున్నారు.ఓ రైల్వే పోలీసు ఆ బాలుడి వెనుక నుంచి ఆస‌క్తిగా అబ్జ‌ర్వ్ చేస్తున్నాడు.

ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 4ల‌క్ష‌లకు పైగా లైక్స్ రావ‌డం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube