వైరల్: తన పెంపుడు కుక్క పుట్టినరోజు సందర్భంగా ఏకంగా అంత మందికి బిర్యానీ పంపిణీ చేసిన కూలీ..!

సెలబ్రెటీల పుట్టినరోజున అభిమానులు రక్తదానం చేయడం, అన్నదానం చేయడం చూసుంటాం.తమ పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు బట్టలు, పుస్తకాలు దానం చేయడం చూసుంటాం.

 Viral A Worker Who Distributed Biryani To So Many People On The Occasion Of His-TeluguStop.com

కానీ తాను పెంచుకుంటున్న కుక్క పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా ఒక వ్యక్తి 150 మందికి బిర్యానీ దానం చేసాడు.అతనే కర్ణాటకలోని షిమోగా పట్టణానికి చెందిన మొహమ్మద్ అయాజ్ అనే వ్యక్తి.

మహమ్మద్ అయాజ్ అనే వ్యక్తికి చిన్నతనం నుండి కుక్కలంటే చాలా ఇష్టం.కుక్కలమీద ఇష్టంతో అయాజ్ గతఏడాది ఏకంగా రూ.28 వేలు ఖర్చు పెట్టి “సైబీరియన్ హస్కీ” జాతి కుక్కను కొని దానికి “టైసన్” అని పేరు పెట్టాడు.అయితే ఆ కుక్కను ఇంటికి తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దీంతో కుక్కతో సహా అయాజ్ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి.షిమోగా పట్టణంలో కూలిపనులు చేసుకుంటున్నారు.కాగా, ఇటీవల అతను పెంచుకుంటున్న కుక్క పుట్టిన రోజు సందర్భంగా దానికి రూ.13 వేలు విలువ చేసే ఒక పరుపును కొన్నాడు.అంతే కాదు హార్ట్ షేపులో కేక్ తయారు చేయించి కేక్ కట్ చేసి స్నేహితుల ఎదుట దానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.అంతేకాక ఆరోజు సాయంత్రం 150 మందికి ఏకంగా బిర్యానీ దానం చేశాడు.

ప్రతిరోజూ మధ్యాహ్నం కూలీ పనులకు వెళ్లేటప్పుడు అయాజ్, తన కుక్కను.కుక్కల డే కేర్ లో వదిలేసి వెళ్తాడు.

మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేటప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఆడుకుంటాడు.ఇక అతనికి ఆ కుక్క తప్ప వేరే ప్రపంచం లేదు.

ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటున్నాం అంటూ కుక్కపై తన ప్రేమను చెప్పాడు అయాజ్.దీంతో ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral A Worker Who Distributed Biryani To So Many People On The Occasion Of His Pet Dog's Birthday, Dog Birthday, Special, Biryani Distribution, Latest News, Viral Latest - Telugu Biryani, Dog, Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube