వైరల్: ఒక్క రూపాయి ఫీజుతోనే తరగతులు చెబుతున్న ఉపాధ్యాయుడు..!

సాధారణంగా ఎవరైనా సరే వారి ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారు రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం వారి వృద్ధాప్య జీవితాన్ని ఏదో ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా బీహార్ లోని సమస్తిపూర్‌ కు చెందిన 61 సంవత్సరాల వయసు గల లోకేశ్ శరణ్ తాను రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం కూడా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ తన జీవనం కొనసాగిస్తున్నాడు.

 Viral A Teacher Telling Classes For A Fee Of One Rupee, Classes, One Rupee Fee,-TeluguStop.com

అంతేకాకుండా కేవలం ఒక్క రూపాయి ఫీజు తోనే పిల్లల అందరికీ పాఠాలు చెబుతున్నాడు.వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

కానీ, ఇది నిజంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.చాలా సంవత్సరాల క్రితం తన తండ్రి ఏర్పాటు చేసిన పాఠశాల కొన్ని కారణాలవల్ల మూతపడగా.

లోకేష్ తన ఇంటి ముందున్న వాకిట్లోనే పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం తనవంతు సాయంగా ఒక రూపాయి ఫీజు తోనే పాఠాలు అందజేస్తున్నట్లు తెలిపాడు.

1983 సంవత్సరంలో లోకేష్ తండ్రి కూడా టీచర్ గా పని చేసి.సైనిక్ విద్యాలయం పేరుతో ఒక పాఠశాలను కూడా ప్రారంభించాడు.

లోకేష్ కూడా అదే పాఠశాలల్లోని పిల్లలకు పాఠాలు నేర్పుతు ఉండేవాడు.ఈ తరుణంలో పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారని తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపించాడు అప్పట్లో.

ఈ తరుణంలో తక్కువ ఫీజు తీసుకోవడంతో లోకేష్ కుటుంబం ఆ సైనిక్ పాఠశాలకు మౌలిక సదుపాయాలను అందించలేకపోయింది.దీనితో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి చివరికి పాఠశాల మూత పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లోకేష్ కు మాత్రం పేద విద్యార్థులకు చదువు చెప్పాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.ఈ కారణంతోనే లోకేష్ తన ఉద్యోగ జీవితంలో కూడా పిల్లలకు ఒక్క రూపాయి ఫీజుతో చదువును నేర్పిస్తున్నారు.

సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి సూచనలు, సలహాలు ఇవ్వడం సాంస్కృతిక కార్యకలాపాలలో విద్యార్థులను నైపుణ్యం పెంచడం లాంటివి లోకేష్ చేస్తున్నరు.కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో కూడా పాఠశాలలు మూతపడిన సందర్భంలో కూడా క్లాసులు నిర్వహించి పిల్లలకు పాఠాలు నేర్పేవాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube