వైరల్: ఆ షోలో లేడి యాంకర్ ను అమాంతం ఎత్తేసిన స్టూడెంట్..!

గత కొద్ది కాలం నుండి బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున క్రేజ్ పెరిగిపోతోంది.దీంతోనే బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల నిర్వాహకులు కూడా రోజు రోజుకు కొత్త కొత్త ఆలోచనలతో, వెరైటీ కాన్సెప్ట్ లతో కార్యక్రమాలను తెరమీదికి తీసుకువస్తున్నారు.

 Viral A Student In Happy Days Show Lifts Ashu Reddy-TeluguStop.com

ఇప్పటికే ప్రతి తెలుగు ఛానల్ లో ఏదోక రకమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చి అబ్బుర పరుస్తున్నారు.ఇందులో ముఖ్యంగా కామెడీతో కూడిన షోలు బుల్లితెరపై సూపర్ హిట్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే అనేక షోస్ కూడా కామెడీ పంచడంలో ముందు వరుసలో ఉండడంతో ఆ షోలు టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి.అయితే ఈ మధ్య కాలంలోనే ఈ టీవీ తెలుగులో కొన్ని కొత్త షో లు తెరమీదికి వచ్చినట్లు కనబడుతున్నాయి.

 Viral A Student In Happy Days Show Lifts Ashu Reddy-వైరల్: ఆ షోలో లేడి యాంకర్ ను అమాంతం ఎత్తేసిన స్టూడెంట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈ మధ్య కాలంలోనే ఈటీవీ లో హ్యాపీ డేస్ అనే టైటిల్ తో యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి యాంకర్లుగా సరికొత్త కార్యక్రమం మొదలైంది.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ను ఆ కార్యక్రమానికి పిలిచి వారితో అనేక రకాల టాస్క్ చేయిస్తూ ఉన్నారు యాంకర్లు.వారితో ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, డాన్సులు చేయించడం లాంటి వివిధ టాస్కులు చేయిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక యాంకర్ అషూ రెడ్డి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో కాస్త బొద్దుగా ఉన్న యాంకర్ అషూ రెడ్డి ని ఎవరైనా బక్కగా ఉన్న వ్యక్తి ఎత్తుకోవడం అంటే సాధ్యం కాని విషయం అని చెప్పగానే వెంటనే ఆ కార్యక్రమానికి హాజరైన ఓ స్టూడెంట్ యాంకర్ అషూ రెడ్డిని ఎత్తుకోవడం, ఎత్తిన తర్వాత ఆమెను గిరాకీ పెరగడంతో అందరిని ఆశ్చర్య పరిచాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.అయితే ముందుగా యాంకర్ రవి అషూ రెడ్డిని బక్కగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఎత్తుకోవాలి అని టాస్క్ ఇవ్వగా ఆ స్టూడెంట్ ఈ పని చేశాడు.

#StudentLifts #Anchor Ravi #AnchorRavi #Social Media #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు