వైరల్: ఫుట్ బాల్ గ్రౌండ్ లోనే తన గర్ల్ ఫ్రెండ్ చేతికి ఉంగరం తొడిగిన ఆటగాడు..!

ప్రేమించిన వ్యక్తి చుట్టూ వేలమంది జనం చూస్తూ ఉండగా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆ అమ్మాయి ఎంత సంబర పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి.వినడానికే ఇంత బాగుంటే మరి చూడడానికి ఇంకెంత బాగుంటుందో కదా.

 A Player With A Ring On His Girlfriend's Hand On The Football Field   Viral New-TeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హసాని డాట్సన్‌ స్టిఫెన్‌సన్‌ తన ప్రియురాలికి గ్రౌండ్‌ లోనే లవ్‌ ప్రపోజ్‌ చేసేసాడు. మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్‌ జోస్‌ ఎర్త్‌క్వేక్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం స్టీఫెన్ తన ప్రేయసికి తన ప్రేమ విషయం తెలిపాడు.

తన గర్ల్‌ఫ్రెండ్‌ పెట్రా వుకోవిక్‌ దగ్గరికి వెళ్లి మోకాళ్లపై కూర్చొని మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఉంగరంతో ఆమెకి ప్రపోజ్‌ చేశారు.తన బాయ్‌ఫ్రెండ్‌ చేసిన ప్రొపోజల్ కి అతని లవర్ కూడా వెంటనే అతనికి సంతోషంతో ఓకే చెప్పేసింది.

తరువాత ప్రేయసికి అందరు చూస్తూ ఉండగానే ఉంగరాన్ని ఆమె చేతికి పెట్టాడు.అనంతరం ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమతో కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు.

ఈ తతంగాన్ని అంతా కెమెరాలో బంధించారు అక్కడ కెమెరా మేన్స్.అయితే స్టీఫెన్ లవ్ ప్రొపోజ్ చేసే సమయంలో చుట్టూ మైదానంలోని ఉన్న ప్రేక్షకులు వీళ్ళని చూసి గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం అంతా అరుపులతో మారు మోగిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు స్టీఫెన్.

Telugu Palyer, Friend, Meida, Latest-Latest News - Telugu

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది.అయితే స్టీఫెన్ ప్రేయసి పెట్రా వుకోవిక్‌ స్టేడియంలో ప్రపోజ్‌ చేసినప్పుడు తీసిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.అలాగే ఆ ఫొటోలతో పాటు ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.“నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు.నీలాంటి వ్యక్తి ప్రేమ దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని.

నా జీవితంలో ఈ అందమైన క్షణాలను ఒక మధుర జ్ఙాపకంలా ఉంచుకుంటాను, ఈ జ్ఞాపకాలను నాకు అందించడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది.ఇలాంటి ప్రేమికుడు దొరికినందుకు పెట్రా వుకోవిక్‌ నిజంగా అదృష్టవంతురాలే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube