వైరల్: గంటలో 150 పైగా వంటకాలు చేస్తోన్న తోమ్మిదేళ్ళ బుడతడు..!

నేటి సమాజంలో పిల్లలు ఫోన్ లకి ఎక్కువగా అట్ట్రాక్ అయ్యి అందులో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు.కానీ.

 Viral Hayan Abdulla Making 150 Dishes In One Hour, Hayan Abdulla, Food Items, O-TeluguStop.com

వంటింట్లో అడుగు పెట్టడం లేదు.ఇక వంట చేసుకోవడానికి బద్ధకం అయ్యి బయటి నుండి ఫుడ్ తెప్పించుకొని తింటున్నారు.

కానీ ఓ మూడో తరగతి బుడతడు మాత్రం విభిన్నంగా గంటలో 150కు పైగా వంటకాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు.కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్‌ అబ్దుల్లా 60 నిమిషాల్లో 150 పైగా వంటలు చేసి రికార్డు సృష్టించాడు.

అందులో బిరియానీలు, జ్యూస్‌లు, పాన్‌కేక్‌లు, దోశలు, సలాడ్లు, మిల్క్‌ షేక్స్, చాక్లెట్స్‌ వంటి వంటలను కేవలం అరవై నిమిషాల్లోనే వండడం ద్వారా ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ద ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.‘‘హయాన్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడే కుకింగ్‌ ఒక అలవాటుగా ఉండేదని, వంటచేయాలన్న ఆసక్తితోనే కిచెన్‌లో నాకు సాయపడేవాడని’’ హయాన్‌ తల్లి రశా అబ్దుల్లా తెలిపారు.

Telugu Varites, Asia, Items, Prepared, Hayan Abdulla, Indian, Latest, Youtube-La

ఇక ఈ విషయమై హయాన్ అబ్దుల్లా మాట్లాడుతూ.‘‘వంటలు చేయాలన్న నా అభిరుచి గురించి తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్లకు కొత్తగా అనిపించలేదు.ఎందుకంటే అమ్మనాన్న కేరళలో పుట్టిపెరిగినప్పటకీ చెన్నైలో అనేక రెస్టారెంట్లను నడుపుతున్నారు.అందుకే వారు నా ఆసక్తిని మొదట్లో పట్టించుకోక పోయినప్పటికీ.తరువాత నేను వేగంగా వంటచేయడాన్ని గమనించి.స్పీడ్‌గా వంటచేయడంతోపాటు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయమని ప్రోత్సహించారు.

దీంతో నేను మరింత వేగంగా వంట చేయడం మొదలు పెట్టానన” అంటూ చెప్పాడు.అయితే నేను ఒక్కో వంటకాన్ని వండడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి టైమ్‌ను రికార్డు చేసేవాడిని.

అలా చేయడం వల్లే వంటల పోటీలో ఎటువంటి ప్రిపరేషన్‌ లేకపోయినప్పటికీ గెలవగలిగానని చెప్పుకోచ్చాడు.ప్రస్తుతం హయాన్‌ చెన్నైలోని షేర్‌వుడ్‌ హాల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు.

ఇతనికి సొంతంగా యూ ట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది.‘హయాన్‌ డెలీకసీ’ పేరుతో ఉన్న ఛానల్‌లో అనేక రకాల వంటకాలను ఎలా తయారు చేయాలో ఇంగ్లీష్, మలయాళం, తమిళ భాషల్లో వివరంగా చూపిస్తుంటాడు హయాన్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube