వైర‌ల్‌.. త‌న ప్రాణాన్ని ప‌ణంగా పెట్టి మ‌రీ బిడ్డ‌ను కాపాడిన త‌ల్లి..

త‌ల్లి ప్రేమ‌ను మించింది ఈ దేశంలో కాదు ఈ సృష్టిలోనే లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటే మ‌న గురించి అంద‌రికంటే ఎక్కువ‌గా ఆలోచించేది మాత్రం కేవ‌లం త‌ల్లిమాత్ర‌మే.

 Viral A Mother Who Risked Her Life To Save Her Baby, Viral Video, Mother Love,-TeluguStop.com

ఎవ‌రు ఎలా అనుకున్నా కూడా త‌ల్లి మాత్రం త‌న బిడ్డ‌ను బంగారంలా చూసుకుంటుంది.బిడ్డ ఎలా ఉన్నా స‌రే త‌న స‌ర్వ‌స్వం అన్న‌ట్టు క‌డుపులో పెట్టుకుని పెంచుకుంటుంది.

ఇక బిడ్డ‌కు ఆక‌లేస్తుందంటే మాత్రం త‌న క‌డుపు మాడ్చుకుని అయినా బిడ్డ క‌డుపు నింపుతుంది.అందుకే త‌ల్లి ప్రేమ‌ను మించిన ప్రేమ సృష్టిలో లేద‌ని చెబుతుంటారు ఎవ్వ‌రైనా.

ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇప్ప‌టికే ఎన్నో ఘ‌ట‌న‌లు వ‌చ్చాయి.అన్నింటిలోనూ త‌ల్లి ప్రేమ అజ‌రామ‌రం అని నిరూపిత‌మైంది.బిడ్డ‌కు ఆప‌ద వ‌స్తే అది మ‌నుషుల్లోనే కాదు జంతువుల్లో అయినా స‌రే త‌ల్లి త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతుంద‌ని నిరూపిత‌మైన విష‌యం విదితేమ‌.ఇప్పుడు మ‌రోసారి బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు త‌ల్లి చేసిన సాహ‌సం గురించి చెప్ప‌బోతున్నాం.

ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.ఓ త‌ల్లి తన చిన్నారితో క‌లిసి ఓ రోడ్డు ప‌క్క‌న ఇటుకల కింద కూర్చోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే స‌డెన్ గా పైకి పేర్చిన ఇటుకలు కాస్తా కింద పడిబోతుండడం ఆ త‌ల్లి గమనించి ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు రెడీ అయిపోయింది.ఈ క్ర‌మంలో త‌న ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టేసింది.ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా బిడ్డ మీద ప‌డ‌నివ్వ‌కుండా తాను అడ్డుగా నిల‌బ‌డింది.ఈ ఘటనలో ఇటుక‌లు మొత్తం త‌ల్లి మీదే ప‌డ్డాయి.ఇక ఆ త‌ర్వాత పిల్లాడిని క్షేమంగా బయటకు తీసి అక్క‌డి నుంచి దూరంగా తీసుకెళ్లింది.ఇదంతా కూడా అక్క‌డి కెమెరాల్లో రికార్డు అయింది.

దీన్ని చూసిన వారంతా కూడా ఆమెను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube