వైరల్: ప్రియురాలు పెళ్లిని ఆపేందుకు నేరుగా ముఖ్యమంత్రికే ట్వీట్..!

ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే తట్టుకోలేరు.ఎంతటి పని చేయడానికైనా సిద్దంగా ఉంటారు.

 Viral A Man Tweets To Bihar Cm To Stop His Girlfriend Marriage , Viral, Viral Ne-TeluguStop.com

అలాంటిది ఓ వ్యక్తి లవర్ కు పెళ్లి ఖరారైంది.దీంతో అతడు తట్టుకోలేకపోయాడు.

తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.అయితే ఎలాగైన తన లవర్ పెళ్లి ఆగిపోవాలి.

అప్పుడే అతడు సంతోషంగా ఉండగలుగుతాడు.అందుకోసం అతడు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.

కానీ ఏం చేయలేని పరిస్థితి.వెంటనే అతడు ఓ నిర్ణయం తీసుకున్నాడు.

అనుకున్నట్లుగానే అతను చేసిన పని ఇప్పుడు వైరల్ అయ్యింది.అతడు చేసిన ఓ మెస్సేజ్ ఇప్పుడు అతడిని ఓ గొప్ప ప్రేమికుడిగా చేసింది.ఇంతకీ అతడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకుందాం.

ప్రేయసి పెళ్లిని ఆపేందుకు ప్రియుడికి ఏం చేయ‌లేని ప‌రిస్థితి ఉంది.

పెళ్లిని ఆపేంత ధైర్యం కూడా ఆ ప్రేమికుడికి లేదు.దీంతో ఏకంగా ఆ ప్రియుడు ముఖ్య‌మంత్రికే ట్వీట్ చేసి నెట్టింట్లో వైర‌ల్ అయ్యాడు.

అయితే మే 13వ తేదీన బీహార్ సీఎం ట్వీట్ చేస్తూ లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి.క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గాయ‌న్నారు.

ఈ క్ర‌మంలో మ‌రో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు తెలిపారు.మే 16 నుంచి 25వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై ఓ యువ‌కుడు స్పందిస్తూ.సార్ మీరు పెళ్లిళ్ల‌ల‌పై నిషేధం విధిస్తే.

మే 19న జ‌ర‌గాల్సిన నా ప్రియురాలి పెళ్లి ఆగిపోతోంది.తాను ఎప్ప‌టికీ మీకు కృత‌జ్ఞుడిగా ఉంటాన‌ని అత‌ను త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ప్రియుడు చేసిన ఆ పనికి తన ప్రేయసి ఫిదా అయ్యిందో లేదో తెలియదు కానీ చాలా మంది అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ప్రేమ కోసం ఈ రోజుల్లో యువకులు ఏం చేయడానికైనా సిద్దపడతారని కొందర చెబుతుండగా మరికొందరు మాత్రం అతడు సీఎంకు ట్వీట్ చేయడం ధైర్యంతో కూడుకున్న పని అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ప్రేమికుడు పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube