వైర‌ల్‌.. రెండు త‌ల‌లు, మూడు కండ్లతో పుట్టిన‌ బల్లి..

Viral A Lizard Born With Two Heads And Three Eyes

ఈ సృష్టిలో చాలా ర‌కాల జంతువులు పుడుతుంటాయి.సాధార‌ణంగా కొన్ని జంతువుల‌కు కొన్ని పోలిక‌లు ఉంటాయి.

 Viral A Lizard Born With Two Heads And Three Eyes-TeluguStop.com

ఆ జాతికి చెందిన జంతువులు అన్నీ కూడా అలాంటి పోలిక‌ల‌తోనే పుడుతుంటాయి.అయితే కొన్ని సార్లు మాత్రం చాలా చిత్ర విచిత్రంగా పుడుతుంటాయి.

ఈ క్ర‌మంలో వాటి పుట్టుక‌కు సంబంధించిన వీడియోలు విప‌రీతంగా నెట్టింట ర‌చ్చ చేస్తుంటాయి.వాటి జాతికి సంబంధించిన పోలిక‌ల‌తో కాకుండా డిఫ‌రెంట్ గా పుట్ట‌డ‌మే అంద‌రినీ షాక్ కు గురి చేస్తుంటాయి.

 Viral A Lizard Born With Two Heads And Three Eyes-వైర‌ల్‌.. రెండు త‌ల‌లు, మూడు కండ్లతో పుట్టిన‌ బల్లి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా స‌రీ సృపాల్లోనే జ‌రుగుతుంటాయి.

మొన్న‌టికి మొన్న రెండు త‌ల‌ల‌తో పుట్టిన దూడను మ‌నం చూశాం.

అంతుకు ముందు మేక‌కు మ‌నిషి త‌ల‌ను పోలిన‌ట్టు ఉన్న జంతువు పుట్ట‌డాన్ని చూశాం.ఇలా ఎక్క‌డో ఓ చోట ఏదో ఒక జంతువు ఇలాంటి వింత ఆకారంలో పుడుతూనే ఉంటోంది.

ఇప్పుడు ఓ బ‌ల్లి ఇలా వింత ఆకాఆరంలో పుట్టింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి బ‌ల్లిని మ‌నం చూసి ఉండం.

ఆస్ట్రేలియా దేశంలో నీలిరంగు నాలుక జాతికి చెందిన‌టువంటి బల్లులు ఎక్కువ‌గా జీవిస్తూ ఉంటాయి.అయితే ఇప్పుడు మాత్రం ఓ బ‌ల్లి ఏకంగా రెండు త‌ల‌లు, మూడు కండ్ల‌తో పుట్టింది.

సాధార‌ణంగా బ‌ల్లులు ఇలాంటి ఆకారంలో అస్స‌లు పుట్ట‌వు.కానీ ఈ బ‌ల్లి మాత్రం రెండు త‌ల‌ల‌తో పుట్ట‌డ‌మే వింత అనుకుంటే పైగా మూడు కండ్లు ఉన్నాయి.సాధార‌ణంగా రెండు త‌ల‌లు ఉంటే నాలుగు కండ్లు ఉండాలి.కానీ ఈ బ‌ల్లికి మాత్రం మూడు కండ్లే ఉండ‌టం ఇక్క‌డ అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.ఇక ఈ బ‌ల్లిని కాలిఫోర్నియాలోని సరీసృపాల జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.అది కాస్తా నెట్టింట్లో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

దీన్ని చూసిన నెటిజ‌న్లు ఓ రేంజ్ లో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

#Australlia #Animals #Strange Lizard #Lizard #Heads

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube