వైర‌ల్‌.. ఆకాశం నుంచి ప‌డ్డ భారీ పాము..

వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కూడా ఆకాశం నుంచి ఏదో ఒక‌టి ప‌డ‌టం అనేది చాలా కామ‌న్ క‌దా.ఎందుకంటే ఆకాశంలో ఉండే కొన్ని మార్పుల కార‌ణంగా ఒక్కోసారి ఒక్కో ర‌క‌మైన వ‌స్తువులు ప‌డుతుంటాయి.

 Viral A Huge Snake Falling From The Sky , Snake, Viral News-TeluguStop.com

ఇప్ప‌టికే మ‌నం మ‌న దగ్గ‌రే చేప‌లు ఆకాశం నుంచి ప‌డ‌టం కూడా చూశాం.ఇంకొన్ని చోట్ల అయితే కొంత సైజులో ఉండే వ‌స్తువులు కూడా ప‌డ‌టం మ‌నం చాలా సార్లు చూస్తున్నాం.

ఇప్ప‌టికే ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న‌ల్ని ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాయి.పైగా సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిపోయిన త‌ర్వాత ఇలాంటివి ఇట్టే వైర‌ల్ అయిపోతున్నాయి.

సోష‌ల్ మీడియా అంటేనే ఇలాంటి విచిత్ర ఘ‌ట‌న‌ల‌కు పెట్టింది పేరు.ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా స‌రే వెంట‌నే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోతుంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ విచ‌త్ర ఘ‌ట‌న నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.అయితే అది జ‌రిగింది మ‌న దేశంలో కాదు ఫిలిప్పీన్స్‌లో.

ఈ దేశంలో రీసెంట్‌గా ఓ విచిత్ర ఘటన అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.ఈ దేశంలోని తగ్బిలారన్ సిటీలో చాలా బిజీ ప్రాంతం అయిన బోహోల్ మార్కెట్ ద‌గ్గ‌ర ఓ భారీ పాము ఆకాశం నుంచి ప‌డింది.

అయితే ఇది భారీ సైజులో ఉండ‌టం విశేషం.

ఈ ర‌ద్దీ ప్రాంతంలోని ఓ వీధిలో ఓవెర్‌ హెడ్‌ వైర్లపై ఈ భారీ పాము అక్క‌డి స్థానికుల‌కు క‌నిపించింది.

చూడ‌టానికి అత్యంత భ‌యంక‌రంగా చాలా పెద్ద‌గా ఉండ‌టంతో దాన్ని చూసిన వారంతా కూడా వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు.అయితే ఆ పాము కొద్దిసేపు అలా వైర్ల మీద పాకిన త‌ర్వాత రోడ్డు మీద పడిపోయింది.

ఇంకేముంది అప్ప‌టి దాకా దాన్ని ఫొటోలు తీస్తున్న వారంతా కూడా ఒక్క‌సారిగా ప‌రుగులు తీశారు.ఇక వీరు తీసిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube