వైరల్: అబ్బురపరుస్తున్న 24 అడుగుల రోబోటిక్‌ శివుడు..!

పరమ శివుడు.నిత్యం చైతన్య స్వరూపుడై భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు.

 Viral A Dazzling 24-foot Robotic Shiva , Robotic, Lord Shiva, Statue, Ongole, Ke-TeluguStop.com

అదే పరమశివుడు కళ్ళ ముందుకు వచ్చి శివ తాండవం చేస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.తాజాగా ఒక ప్రాంతంలో మాత్రం శివుడు ఉగ్రరూపంతో నాట్యం చేశాడు.

ఈ శివుడి విగ్రహం ఏకంగా 24 అడుగుల ఎత్తు ఉంది.

ఇలా కళ్ళ ముందే శివతాండవం, కన్నుల పండుగ చేసే శివుని నాట్యం భక్తులను అందరిని పరవశింప చేస్తుంది.

ఇంతకి ఈ శివతాండవం చేస్తున్న విగ్రహం ఎక్కడ అని అనుకుంటున్నారా.? ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది.మనం సాధారణంగా అనేక రకాల శివుని విగ్రహాలు చూసి ఉంటాం.కానీ, ఈ రోబోటిక్ శివుడి విగ్రహం చాలా అరుదు.ఇది సాధారణమైన విగ్రహం కాదు.ఇది ఒక ప్రత్యేకమైన రోబోటిక్ విగ్రహం.

అంతేకాకుండా ఈ రోబోటిక్ శివుని విగ్రహం మాత్రం కాళ్ళు, చేతులు కదిలిస్తూ నాట్యం చేస్తుంది.

నాట్యం చేస్తున్న రోబోటిక్ విగ్రహం చూసి ప్రజలందరూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.

ఒంగోలు నగర వీధులలో 24 ఆ విగ్రహాన్ని పలు వీధులలో ఊరేగింపు యాత్ర నిర్వహించారు ఆలయ సిబ్బంది వారు.ఈ రోబోటిక్ సివిల్ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఈ రోబోటిక్ శివుడి విగ్రహం కేరళ నుంచి ప్రత్యేకంగా తెపించినట్లు ఆలయ సిబ్బంది తెలిపింది.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.కేరళ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ విగ్రహాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలులో ప్రవేశపెట్టామని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube