వైరల్: తన ఫోన్ ని రిపేర్ చేయవద్దని రిపేరు చేసే వ్యక్తికి లంచం..! అసలు మ్యాటరేంటంటే..?!

లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన ఐఫోన్ దురదృష్టవశాత్తు కిందపడి పగిలి పోతే ఆ బాధ వర్ణనాతీతం.ముఖ్యంగా ఫోన్ పాడైతే దానిలోని డేటా కూడా వదులుకోవాల్సిందే.

 Viral A Bribe To A Repairman Not To Repair His Phone What Is The Real Matter-TeluguStop.com

దీనివల్ల డబ్బుతో పాటు భద్రంగా దాచుకున్న ఎన్నో మధుర స్మృతులు కూడా ఒకేసారి తుడిచిపెట్టుకు పోతాయి.అయితే ఫోన్ పగిలి పోయినా దాన్ని రిపేరు చేయించి దానిలోని డేటాను పొందొచ్చు.

అనుభవం కల మెకానిక్స్ సహాయంతో ఎంతటి ఫోన్నయినా బాగు చేయించుకోవచ్చు.

 Viral A Bribe To A Repairman Not To Repair His Phone What Is The Real Matter-వైరల్: తన ఫోన్ ని రిపేర్ చేయవద్దని రిపేరు చేసే వ్యక్తికి లంచం.. అసలు మ్యాటరేంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఒక భర్త మాత్రం తన ఖరీదైన ఫోన్ ని అస్సలు బాగు చేయొద్దని రిపేర్ షాపు టెక్నీషియన్ కి విన్నవించుకున్నాడు.

అంతేకాదు ఫోను అస్సలు బాగు చేయొద్దని $200 అనగా మన భారత కరెన్సీలో దాదాపు 15 వేల రూపాయలు ఎదురొచ్చి బతిమిలాడాడు.అయితే భర్త చేసిన ఈ వింతైన విన్నపం గురించి సదరు టెక్నీషియన్ టిక్ టాక్ వీడియోలో వివరించాడు.

దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.

వైరల్ అయిన వీడియోలో ఏం కనిపించిందంటే.

బాగా పాడైపోయిన ఒక ఐఫోన్ దానిపై నిలువుగా ఉన్న రంగురంగుల గీతలు అక్కడక్కడా పగుళ్ళు.అలాగే ఇదే ఐఫోన్ ఫోన్ ఫ్రంట్ కవర్ కింద భద్రంగా దాచిన ఒక పేపర్, దాంతోపాటు $200 కనిపించాయి.

అయితే ఆ పేపర్ పై నా మొబైల్ ఫోన్ రిపేర్ చేయొద్దు.నా భార్య చంపేస్తుంది.

నీకోసం $200 ఉంచాను తీసుకో.ధన్యవాదాలు, అని రాసి ఉంది.

ఐతే ఈ విషయాన్ని టిక్ టాక్ లో షేర్ చేసుకున్న సదరు టెక్నీషియన్ తన కస్టమర్లు తమ భార్యలను మోసం చేయడం భలే ఆసక్తిగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.

అయితే భార్య నుంచి దాచేంతగా ఆ మొబైల్ ఫోన్ లో ఏమి డేటా ఉండి ఉంటుందని? నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.కొంతమంది ఫోన్ రిపేర్ చేసి ఆ మొబైల్ ఫోన్ లో ఏముందో చూసి ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయాల్సిందిగా ఉచిత సలహాలు ఇస్తున్నారు.ఆ ఫోన్ లో ఏముందో చెప్పాలని మరికొంత మంది నెటిజన్లు కోరుతున్నారు.

ఏది ఏమైనా తన భార్య చంపేస్తుందని.ఫోన్ రిపేర్ చేయొద్దని సదరు భర్త లంచం ఇచ్చి మరీ వేడుకున్నా కూడా నెటిజన్లు మాత్రం అతడి సీక్రెట్ బయటపెట్టమని డిమాండ్ చేస్తూ అందరినీ విస్తుపోయేలా చేస్తున్నారు.

#Viral Video #Phone Repair #Social Media #Girl Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు