ఈ భూమిపై నివసిస్తున్న ఏ ప్రాణికైనా అమ్మ ప్రేమ ఒకటే.అమ్మ లేని సంతానం ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
మనుషులకైనా, పక్షులకైనా, జంతువైనా తల్లి ప్రేమలో ఎలాంటి తేడా ఉండదు.కన్నబిడ్డలను పంచ ప్రాణంగా చూసుకుంటుంది తల్లి.
అవసరమైతే వారికోసం ప్రాణాలను సైతం అర్పిస్తుంది.అవును, తల్లిలేని ఆ బాధ ఎలా ఉంటుందో తాజాగా ఓ చిన్ని కోతిపిల్ల తల్లిని పోగొట్టుకుని తల్లడిల్లిన వీడియో తెలియజేస్తుంది.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా కంటతడి పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే, అసోంలో రోడ్డు దాటుతున్న క్రమంలో అత్యంత వేగంగా వెళ్తున్న వాహనం ఒకటి ఓ వానరాన్ని ఢీకొట్టడంతో ఆ కోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఆ సమయంలో దాని ఒడిలో తన పిల్ల వానరం కూడా ఉండడం గమనార్హం.అయితే అదృష్టవశాత్తు ఆ చిన్ని వానరానికి ఏమీ కాలేదు.
ఇక తన తల్లి ఎందుకు అలా రోడ్డుపై చలనం లేకుండా పడి ఉందో తెలియక… తల్లిని లేపే ప్రయత్నం చేసింది.అయినా తల్లి లేవకపోవడంతో ఆ పిల్ల వానరం కంటతడి పెడుతోంది.
ఇక కాసేపటికి తల్లి చనిపోయిందని తెలుసుకున్న ఆ బుల్లి వానరం చాలా తీవ్రంగా రోదించింది.కాగా ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కలచివేస్తోంది.అంతేకాకుండా స్థానికంగా వున్నా జనాలు కూడా ఆ పిల్ల కోతి బాధను చూసి తట్టుకోలేకపోయారు.
అక్కడ స్థానికంగా చూసిన జనాల్లో ఒకరు ఆ దృశ్యాన్ని షూట్ చేయడం జరిగింది.ఆ వీడియోని IFS అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్లను సైతం కన్నీళ్లు పెట్టేలా చేస్తోంది.
కాగా ఆ చిన్ని వానరాన్ని సంరక్షించేందుకు అన్ని చర్యలూ చేపడతామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు IFS అధికారి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy