వైరల్: సముద్రంలో 900 సంవత్సరాల నాటి ఖడ్గం..!

Viral 900 Year Old Sword In The Sea

ఇప్పటికి మన పురాతన కాలానికి సంబంధించిన కొన్ని రకాల వస్తువులు మనకు లభ్యం అవుతూనే ఉన్నాయి.వాటిని చూడగానే మనకే ఆశ్చర్యం వేస్తుంది.

 Viral 900 Year Old Sword In The Sea-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక పురాతన కాలానికి చెందిన ఒక అద్భుతమైన, అరుదైన ఖడ్గం ఒకటి ఒక స్కూబా డ్రైవర్ కి దొరికింది.శ్లోమి కాట్జిన్ అనే స్కూడా డైవర్‌ మధ్యధరా సముద్రం అడుగు భాగంలో డైవింగ్‌ చేయడానికి వెళ్ళాడు.

సముద్ర అడుగు భాగంలో ఉండే అత్యద్భుతమైన దృశ్యాలను, జంతువులను తన కెమరాలో బంధిస్తున్న క్రమంలో అతనికి అనుకోకుండా ఒక పొడవాటి ఖడ్గం కనపడగా వెంటనే ఆ కత్తిని చేతుల్లోకి తీసుకున్నాడు.దానిని చుసిన తరువాత అది ఒక పురాతన ఖడ్గం అని భావించి ఇంకా ఎమన్నా దొరుకుతాయేమో అని ఆ చుట్టు పక్కల అంతా వెతికాడు.

 Viral 900 Year Old Sword In The Sea-వైరల్: సముద్రంలో 900 సంవత్సరాల నాటి ఖడ్గం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా వెతగ్గా మరికొన్ని పురాతన కళాఖండాలను అతనికి కనిపించాయి.కత్తితో పాటు ఆ కళాఖండాలను కూడా తీసుకుని కాట్జిన్ సముద్రం నుంచి వచ్చేసాడు.ఆ తరువాత అతనికి దొరికిన కళాకండాలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి అప్పగించాడు.కాగా ఆ కత్తిని పరిశీలించిన అథారిటీవారు అది 900 ఏళ్ల క్రితం నాటి ఖడ్గం అని చెప్పారు.

ఈ కత్తిని మరింత శుభ్రం చేసిన తరువాత గాని పూర్తి వివరాలు వెల్లడించలేమని రోబరీ ప్రివెన్షన్ యూనిట్ అథారిటీ ఇన్‌స్పెక్టర్ నిర్ డిస్టెల్‌ఫెల్డ్ తెలిపారు.ఈ సందర్భంగా పురాతన వస్తువుల అథారిటీ అధికారులు మాట్లాడుతు.

శ్లోమి కాట్జిన్ అనే స్కూబా డైవర్ సముద్రంలో డ్రైవింగ్ చేస్తుండగా ప్రాచీన కాలం నాటి మీటరు పొడవున్న కత్తితో పాటు లంగర్లు, కుండలు లభ్యమయ్యాయని తెలిపారు.

Telugu 900 Years Old, Discovers, Estimated, News Viral, Scuba Diver, Social Media, Sword, Viral Latest-Latest News - Telugu

అయితే ఈ కత్తిని అప్పట్లో ఎవరో ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ నుంచి దొంగలించారని అధికారులు తెలిపారు.అలా అప్పుడు మాయం అయిన ఆ కత్తిని పట్టుకొచ్చి తమకు అప్పగించినందుకు అథారిటీ అధికారులు కాట్జిన్‌ కి పౌరసత్వ ప్రశంసా పత్రాన్ని అందించారు.ఈ క్రమంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ఈ సంఘటన గురించిన వీడియోను ఫేస్బుక్‌ లో షేర్‌ చేయగా అది కాస్త నెట్లింట తెగ వైరల్‌ అయింది.

#Discovers #Sword #Scuba Diver

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube