వైరల్: 37 సంవత్సరాల బాటిల్ మెసేజ్ కధ ఇప్పటికి సుఖాంతం.. !!

మీకు గుర్తు ఉందో లేదో చిన్నప్పుడు మనం మన దగ్గర ఉన్న డబ్బు కాగితాల మీద మన పేరు రాసి ఈ నోటు ఎప్పటికన్నా మన దగ్గరకు వస్తుంది అని ఆశించేవాళ్ళము కదా.అచ్చం అలాగే చాలా సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ చూపించారు.

 Viral: 37 Year Old Bottle Message Story Still Has A Happy Ending .bottle Message-TeluguStop.com

డబ్బుల మీద ఫోన్ నంబర్స్ వేయడం, ఏదన్నా సీసాలో ఒక లెటర్ పెట్టి దాన్ని నదిలో వేయడం.అది తరువాత హీరోలను రీచ్ అవ్వడం లాంటి ఎన్నో సీన్స్ ను మనం సినిమాల్లో చూసే ఉంటాము.

సరిగ్గా ఇప్పుడు నిజ జీవితంలో కూడా అలాంటి ఒక విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.సరిగ్గా 37 సంవత్సరాల క్రితం కొంతమంది విద్యార్థులు కొన్ని బాటిల్స్ లో లెటర్స్ రాసి వాటిని సముద్రంలో జార విడిచారు.

అలా మూడు దశాబ్దాల క్రితం సముద్రంలో వదిలిన ఒక బాటిల్ ఇప్పుడు హవాయ్ ప్రాంత బీచ్ లో దొరికింది.అసలు ఆ బాటిల్ గురించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జపాన్ రాజధాని టోక్యోలోని తూర్పు ప్రాంతమైన చీబాలోని చోసీ హైస్కూల్‌ కు సంబంధించిన న్యాచురల్ సైన్స్ క్లబ్ విద్యార్థులు 1984,1985 సంవత్సరాలలో సముద్ర ప్రవాహాలపై పరిశోధన నిమిత్తం ఒక 750 బాటిళ్లను సముద్రంలో విడిచిపెట్టారు.ఆ బాటిల్స్ అన్నిట్లోనూ కాగితం మీద ఓ సందేశం రాసి ఆ కాగితాన్ని సీసాలో పెట్టి సీసాలోకి నీరు పోకుండా ఉండడానికీ సీసాకి గట్టిగా మూత బిగించి దాన్ని సముద్రంలోకి విసిరారట.

అలా ఆ బాటిల్ దాదాపు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి తాజాగా హవాయ్‌ బీచ్‌ కు చేరుకుంది.ఈ బాటిల్ ఎవరికి దొరికినా తమను సంప్రదించాలంటూ ఆ బాటిళ్లలోని కాగితాల్లో ఇంగ్లిష్‌, జపనీస్‌, పోర్చుగీస్ భాషల్లో సందేశాలు రాసి బాటిల్స్ దొరికిన వారు తమని సంప్రదించాలని రాసిపెట్టారట.

అలా సముద్రంలో వదిలేసిన 750 బాటిళ్లు ఫిలిప్పీన్స్‌, కెనడా, అలస్కా ప్రాంతాలకు కొట్టుకుపోయాయి.కొన్ని సంవత్సరాలకు కొన్ని బాటిళ్లు కొందరికి దొరికగా వాటిని చదివి తిరిగి ఆ సందేశాన్ని వారికి అప్పగించారు.

అలా 2002లో జపాన్‌ లోని వాయవ్య ప్రాంతమైన కగోషిమాలో 50వ బాటిల్ దొరికింది.ఇప్పుడు మళ్ళి హవాయ్‌ లోని ప్యారడైజ్ పార్క్‌ సమీపంలో ఇద్దరు బాలికలకు ఆ 51 బాటిల్ దొరికింది.

Telugu Bottle, Bottle Message, Hawaii, Japan, Latest-Latest News - Telugu

బీచ్ లో ఆడుకుంటుండగా మట్టిలో ఉన్న బాటిల్ కనిపించడంతో దాన్ని పైకి తీసి ఆ బాటిల్ ను బాలికలు వారి తల్లిదండ్రులకు చూపించారు.ఆ సీసాలో ఒక సందేశం రాసి ఉందని వారు తెలిపారు.సీసాలో ఉన్న లెటర్ లో ఈ విధంగా రాసి ఉందని బాలిక తెలిపింది.పెద్ద అక్షరాలతో.ఓసియన్ కరెంట్ ఇన్వెస్టిగేషన్.చిబా ప్రిఫెక్చురల్ చోషి హై స్కూల్ నేచురల్ సైన్స్ క్లబ్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు నోట్ ఉన్నట్లుగా తెలిసిందని చెప్పింది.

ఈ సీసా 1984 జూలైలో జపాన్‌ లోని చోషి తీరంలో సముద్రంలోకి విసిరివేయబడింది అని రాసి ఉందట.అయితే ఈ 51వ బాటిల్ విషయం గురించి తెలిసిన చోషి హైస్కూల్ వైస్ ప్రిన్సిపల్ జున్ హయాషీ ఈ విధంగా స్పందించారు.37 ఏళ్ల తర్వాత ఆ బాటిల్ మెసేజ్ దొరకడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.19 ఏళ్ల క్రితం మేము విసిరిన వాటిలో 50వ బాటిల్ దొరికింది ఇక అదే చివరి బాటిల్ అని అనుకున్నాను.కానీ ఆశ్చర్యకరంగా మరో బాటిల్ దొరుకుతుందని అస్సలు ఊహించలేదని లేదని హయాషీ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube