వైరల్: 35 ఏళ్ల ఎస్ఐ పెళ్లికాలేదని ఏం చేసిందంటే..!

ఈనాటి రోజుల్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మందికి సవాల్ గా మారింది.కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి బంధానికి బలైపోతున్నారు.

 Viral 35 Years Si Kavitha Solanki Drink Poison And Died For Not Getting Married-TeluguStop.com

తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ పెళ్లి జరగలేదనే నెపంతో బలవన్మరణం పొందింది.ఆమె ఒక బాధ్యతతో డ్యూటీ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అయినా తనకి ఇటువంటి అవమానం తప్పలేదు.

ఎంతో కష్టపడితే ఎస్సై ఉద్యోగాన్ని సాధించింది.అయితే ఆమెకు 35 సంవత్సరాలు అవ్వడం వలన చాలా మంది ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగేవారు.

ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తూ ఆమెను మానసికంగా క్షోభకు గురి చేసేవారు.ఆమె ఎప్పుడూ బయటకు వెళ్లినా సరే ఎందుకు పెళ్లి కవాట్లేదు అని అడగడంతో ఆమె విసుగు చెందింది.

చాలా మందికి ఆమె సమాధానం చెప్పలేక బాధపడింది.

ఈ మధ్యనే ఆమె సెలవుల్లో ఇంటికి వెళ్లింది.

ఇంటికి వెళ్లిన ప్రతిసారీ కూడా తెలిసిన వారు ఆమెను ఈ ప్రశ్నే వేశారు.దీంతో ఆమె ఎంతో ఆవేదన చెందింది.

ఇంటి నుంచి వెళ్లి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత అదే రోజు రాత్రి అధికార నివాసంలో ఆమె విషం తాగింది.చాలా మందికి సమాధానాలు చెప్పలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.తాను చనిపోతున్నాననే విసయం తన స్నేహితురాలికి చెప్పింది.దీంతో స్నేహితురాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ ఆమె కొన ఊపిరితో కొట్టుకుంటోంది.

Telugu Si, Commits, Poison, Female Si, Kavitha Solanki, Married-Latest News - Te

ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు పని చేస్తోంది.సెలవు పెట్టి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లినప్పుడు తన చేదు అనుభవం ఎదురైంది.

దీంతో అదేరోజు రాత్రి తన అధికార నివాసంలో విషం తాగింది.ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube